Pourusham Movie Pre Release Event: షెరాజ్ మెహ్ది హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న మూవీ పౌరుషం. ది మ్యాన్ హుడ్ ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాను UVT హాలీవుడ్ స్టూడియోస్ (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి సంయుక్తంగా తెరకెక్కించారు. సుమన్ తల్వార్, మేకా రామ కృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, జ్యోతి రెడ్డి, జబర్దస్త్ కెవ్వు కార్తీక్, జబర్దస్త్ హీనా, జబర్దస్త్ కట్టప్ప తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ షేరాజ్ మెహ్దీ అందించారు. ఎడిటర్‌గా డివి ప్రభు పనిచేస్తున్నారు. ఈ సినిమా రేపు (మార్చి 7) ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో, దర్శకుడు, షెరాజ్ మెహ్ది మాట్లాడుతూ.. ఈ సినిమా కథ తన మనసులో నుంచి వచ్చిందని.. ఇందులోని సన్నివేశాలు, యాక్షన్స్ అన్ని నిద్రలో లేపి అడిగినా చెప్తానని అన్నారు. ఇప్పటివరకు తాను 8 సినిమాలకు సంగీతం అందించానని.. ఇది తొమ్మిదో సినిమా అని తెలిపారు. తాను నిర్మాత సపోర్ట్‌తోనే ఈ సినిమాను తీయగలిగానని అన్నారు. ఇది తాను కళ్లతో చూసిన స్టోరీ అని.. ఒకరి వల్ల మరొకరు ఎలా ఇబ్బంది పడతారు అనే కంటెంట్‌తో తీశామన్నారు. యాక్షన్, ఫ్యామిలీ, రొమాంటిక్ అన్ని అంశాలతో రూపొందించామన్నారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారని అన్నారు. ఆడవాళ్లు లేకపోతే మగవాళ్లు లేరని.. వాళ్ల సపోర్ట్‌తో ముందుకు వెళ్లాలనే బ్యూటీఫుల్ కాన్సెప్ట్‌తో చూపించామన్నారు. ఈ సినిమా పౌరషంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి ఆదరించాలని కోరారు.
ప్రొడ్యూసర్ అశోక్ ఖుల్లార్ మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చిందని.. మంచి కంటెంట్‌ను ఆడియన్స్‌కు అందిస్తున్నామన్నారు. నటుడు గంగాధర్ మాట్లాడుతూ.. తాను ఈ సినిమాలో హీరోయిన్ అన్నయ్య పాత్రను పోషించానని చెప్పారు. హీరో శివ తన నటనతో తాండవం చేశారని మెచ్చుకున్నారు. సైన్స్, దేవుడు వేరు కాదు.. రెండు ఒక్కటే అనే పాయింట్ ఉంటుందన్నారు. నటి కుష్బూ జైన్.. తాను ఈ మూవీలో ఓ చిన్న రోల్ చేశానని.. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా అని చెప్పారు.
టెక్నికల్ టీమ్:
==> బ్యానర్: UVT హాలీవుడ్ స్టూడియోస్ (USA)/శ్రేయ ప్రొడక్షన్స్
==> ప్రొడ్యూసర్: అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి
==> మ్యూజిక్, స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే & డైరెక్షన్: షెరాజ్ మెహ్ది
==> DOP : కావేటి ప్రవీణ్
==> కొరియోగ్రాఫర్ : సాయి రాజ్
==> ఆర్ట్/సెట్ డైరెక్టర్ : ముత్తు/నాని/నాగు బాబు
==> సాహిత్యం : బాష్య శ్రీ
==> యాక్షన్ : షావోలిన్ మల్లె
==> ఎడిటర్ : డివి ప్రభు
==> PRO : SR ప్రమోషన్స్









