close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

సైమా అవార్డ్స్‌: ఉత్తమ నటుడు రామ్ చరణ్, ఉత్తమ నటి కీర్తి సురేష్ !!

Updated: Aug 16, 2019, 03:58 PM IST
సైమా అవార్డ్స్‌: ఉత్తమ నటుడు రామ్ చరణ్, ఉత్తమ నటి కీర్తి సురేష్ !!

ఖతార్‌ వేదికగా  సౌత్ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ (సైమా) వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ యాంకర్‌ సుమ, హాస్యనటులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వ్యాఖ్యాతలుగా అభిమానులను అలరించారు. కాగా ఈ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి, కీర్తి సురేశ్‌, రాధిక, శ్రియ, పాయల్‌ రాజ్‌పుత్‌, యశ్‌, విజయ్‌ దేవరకొండ తదితరులు హాజరై సందడి చేశారు. 

సైమా అవార్డ్స్‌ కార్యక్రమంలో భాగంగా  తెలుగు, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులకు అవార్డులు ప్రకటించారు.  ఉత్తమ నటుడిగా రామ్ చరణ్ ఎంపిక కాగా.. మహానటి హీరోయిన్ కిర్తీ సురేష్ కు ఉత్తమ నటిగా ప్రకటించారు. జాతీయ స్థాయిలో కీర్తి సురేష్ కు ఉత్తమ నటి అవార్డు వరించిన విషయం తెలిసిందే. సైమా కూడా ఆమెనే ఉత్తమ నటిగా ప్రకటించడం గమనార్హం.

జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైనా మహానటి మూవీని సైమా ఉత్తమ చిత్రంగా ప్రకటించడం గమనార్హం. ఇదిలా ఉండగా రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం మూవీకి ఏకంగా 8 అవార్డు వరించడం గమనార్హం. కాగా వివిధ విభాగాల్లో అవార్డులు అందుకున్న జాబితాను ఒక్క సారి పరిశీలిద్దాం...

సైమా విజేతలు వీరే..
* ఉత్తమ చిత్రం: మహానటి  ( తెలుగు)
* ఉత్తమ నటుడు: రామ్‌చరణ్‌ (రంగస్థలం)
* ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌  (మహానటి)
* ఉత్తమ నటి (క్రిటిక్‌): సమంత (రంగస్థలం)
* ఉత్తమ నటుడు (క్రిటిక్‌): విజయ్‌ దేవరకొండ (గీతా గోవిందం)

* ఉత్తమ పరిచయ నటుడు: కల్యాణ్‌ దేవ్‌ (విజేత)
* ఉత్తమ పరిచయ నటి: పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)
* ఉత్తమ సహాయ నటి: అనసూయ భరద్వాజ్‌ (రంగస్థలం)
* ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్రప్రసాద్‌ (మహానటి)
* ఉత్తమ హాస్యనటుడు: సత్య (ఛలో)
* ఉత్తమ ప్రతినాయకుడు: శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)

* ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (రంగస్థలం)
* ఉత్తమ పరిచయ దర్శకుడు: అజయ్‌ భూపతి (ఆర్‌ ఎక్స్‌ 100)
* ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)
* ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌(రంగస్థలం-  ఎంత సక్కగున్నావే)
* ఉత్తమ గాయని: ఎం.ఎం మానసి (రంగస్థలం- రంగమ్మా..మంగమ్మా పాట)

* ఉత్తమ గాయకుడు: అనురాగ్‌ కులకర్ణి (ఆర్‌ ఎక్స్‌ 100- పిల్లారా.. పాట)
* ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: రత్నవేలు (రంగస్థలం)
* ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: మౌనిక రామకృష్ణ (రంగస్థలం)
* పాపులర్‌ సెలబ్రిటీ ఆన్‌ సోషల్‌మీడియా: విజయ్‌ దేవరకొండ