ఇటీవల బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆనంద్ ఎస్ అహూజాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట మే 8న వివాహం చేసుకుంది. మిగతా హీరోయిన్ల మాదిరి కాకుండా సోనమ్ వెంటనే తన వృత్తిలో దిగిపోయి.. మొదట కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంది. అయితే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న సోనమ్ చేతిపై ఒక బ్రాస్‌లెట్ స్పెషన్ అట్రాక్షన్‌గా నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



 





సాధారణంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్లు తమ మంగళసూత్రాన్ని మెడలో ధరించడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ సోనమ్ కపూర్ మాత్రం తన మాంగల్యాన్ని అనునిత్యం శరీరంపై ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే చేతికి మంగళసూత్రం కట్టుకుంది. భర్త ఆనంద్ ఎస్ అహుజాపై ప్రేమకు గుర్తుగా ప్రత్యేకంగా బ్రాస్ లెట్ మాదిరి డిజైన్ చేయించుకొని.. ఇద్దరి రాశులైన సింహ, మిధున చిహ్నాలను చైన్ కు ఉంచింది. ఇలా చేతికి మంగళసూత్రం ధరించడం వింతే అయినా.. వివాహం తరువాత అరుదుగా మాత్రమే మిగితా హీరోయిన్లు మంగళసూత్రాన్ని ధరిస్తున్న తరుణంలో.. భర్తపై ప్రేమతో ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని  ఒకింత స్వాగతించొచ్చు.