విలన్ గా మారిన సక్సెస్ ఫుల్ హీరో ..ఎందుకంటే ?

వరస విజయాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న హీరో కార్తికేయ విలన్ గా నటించేందుకు ఎందుకు ఒప్పుకున్నాడు ?

Last Updated : Feb 20, 2019, 07:53 PM IST
విలన్ గా మారిన సక్సెస్ ఫుల్ హీరో ..ఎందుకంటే ?

కెరీర్  సక్సెస్ ఫుల్ సాగుతున్న హీరోలు ఎవరూ విలన్ నటించేందుకు ఒప్పకోరు.. విలన్ గా వచ్చిన హీరోలుగా మారుతారు తప్పితే..హీరోగా ఎదుగుతున్న వారు ఎవరూ విలన్ గా ఒప్పకోరు. అయితే అందుకు భిన్నంగా ఓ నిర్ణయం తీసుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ..ఎందుకో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లండి మరి..

అర్ఎక్స్100తో ఊహించని విజయం అందుకున్నాడు. హీరోగా వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ సెట్స్ పైకి 2 సినిమాలు కూడా తీసుకొచ్చాడు. ఇలాంటి టైమ్ లో ప్రయోగాలు చేయాలని ఎవరూ అనుకోరు. కానీ కార్తికేయ అనుకున్నాడు. అందుకే విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడు.

నాని-విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో రీసెంట్ గా సెట్స్ పైకి వచ్చిన సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు కార్తికేయ. క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉండడంతో పాటు, యాక్టింగ్ కు మంచి స్కోప్ దొరకడంతో వెంటనే అంగీకరించాడు.

హీరోగా మారిన తర్వాత ఎంత కాదనుకున్నా ఓ ఇమేజ్ వచ్చేస్తుంది. అప్పుడు ఆటోమేటిగ్గా కొన్ని పాత్రలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటి ఇమేజ్ రాకముందే ప్రయోగాలు చేస్తే నటుడిగా సత్తా ఏంటో తెలిసొస్తుంది. ప్రస్తుతం కార్తికేయ చేస్తోంది అదే.

హీరోగా ఓవైపు నటిస్తూనే, మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అయ్యాడు కార్తికేయ. అందులో మొదటి అడుగు నాని-విక్రమ్ కుమార్ సినిమా. త్వరలోనే ఈ హీరో నుంచి ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ మరిన్ని చూడబోతున్నాం.

Trending News