Kora Movie: హై ఓల్టేజ్ మూవీ కోర.. అతి త్వరలోనే ఆడియన్స్ ముందుకు..!

Kora Movie: ఈ నెలలో ఆడియన్స్‌ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది కోర మూవీ. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతుండగా.. అతి త్వరలోనే రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 6, 2025, 10:54 PM IST
Kora Movie: హై ఓల్టేజ్ మూవీ కోర.. అతి త్వరలోనే ఆడియన్స్ ముందుకు..!

Kora Movie: డిఫెరెంట్ కాన్సెప్ట్, హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా 'కోర' ఆడియన్స్‌ ముందుకు రానుంది. ఈ మూవీకి ఒరాటశ్రీ దర్శకత్వం వహిస్తుండగా.. సునామీ కిట్టి హీరోగా నటిస్తున్నారు. చరిష్మా, పి.మూర్తి కీలక పాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై డా.ఏబీ నందిని, ఎ.ఎన్.బాలాజీ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్‌తో అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చింది.  

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసే పనుల్లో చిత్ర బృందం బిజీగా ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను వెల్లడించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ విడుదల చేసిన ఒప్పుకుందిరో.. అంటూ సాగే సాంగ్‌ విపరీతంగా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సెల్వం మాతప్పన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. బీఆర్ హేమంత్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలు కె.గిరీష్ కుమార్ నిర్వర్తిస్తున్నారు. 

టెక్నికల్ టీమ్:
 
==> రైటర్, డైరెక్టర్: ఒరాటశ్రీ
==> ప్రొడ్యూసర్స్: డా.ఎ.బి.నందిని, ఎ.ఎన్.బాలాజీ
==> బ్యానర్: శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్
==> కెమెరామెన్: సెల్వం మత్తప్పన్
==> మ్యూజిక్: బి ఆర్ హేమంత్ కుమార్ 
==> ఎడిటర్: కె.గిరీష్ కుమార్ 
==> విన్యాసాలు: కోరా చిన్నయ్య 
==> మేకప్: ప్రదీప్ 
==> ఆర్ట్ డైరెక్టర్: జినేద్ర
==> PRO: సాయి సతీష్

Also Read: AP Aqua Industry: 'డొనల్డ్‌ ట్రంప్‌ దెబ్బకు అల్లాడుతున్నాం.. కాపాడండి': సీఎం చంద్రబాబు లేఖ

Also Read: Telangana Inter Results 2025: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు ఎక్కడ చెక్ చేసుకోవాలి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News