‘పేట’ హిట్ టాక్ పై రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు: క్రెడిట్ అంతా ఆయనదే..

పేట సినిమాపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

Updated: Jan 11, 2019, 08:42 PM IST
‘పేట’ హిట్ టాక్ పై రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు: క్రెడిట్ అంతా ఆయనదే..

సౌత్ ఇండియాన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట’ చిత్రం గురువారం విడుదలైంది. హిట్ టాక్ సొంత చేసుకోవడంపై చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ స్పందిస్తూ ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చిందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తన అభిమానులకు రజనీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రజనీకాంత్ పేట చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుపై ప్రశంసల జల్లు కురిపించారు. పేట మూవీ హిట్ కు ప్రధాన కారణం దర్శకుడు కార్తీక్ అన్ని వ్యాఖ్యానించారు. ఈ మూవీలో తనదేమీ లేదని.. ఈ ప్రశంసలన్నీ కార్తీక్ సుబ్బరాజ్ కే చెందుతాయని..ఈ సినిమా విజయానికి కారణం ఆయనేనని దర్శకుడికి ఆకాశానికి ఎత్తేశారు. రజనీకాంత్. అమెరికా టూర్ నుంచి తిరిగి వచ్చిన సందర్భంలో ఎయిర్ పోర్టులో మీడియా అడిగిన ప్రశ్నలకు రజనీకాంత్ ఈ విధంగా స్పందించారు