O Andala Rakshasi: నేను చెప్పినట్లే 'ఓ అందాల రాక్షసి' పెద్ద సక్సెస్: తమ్మారెడ్డి భరద్వాజ్

O Andala Rakshasi Movie Success Meet: ఓ అందాల రాక్షసి మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని.. మౌత్ టాక్‌తో జనాల్లోకి వెళ్లిపోయిందని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 24, 2025, 06:39 PM IST
O Andala Rakshasi: నేను చెప్పినట్లే 'ఓ అందాల రాక్షసి' పెద్ద సక్సెస్: తమ్మారెడ్డి భరద్వాజ్

O Andala Rakshasi Movie Success Meet: షెరాజ్ మెహదీ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహించిన చిత్రం ఓ అందాల రాక్షసి. ఈ నెల 21న థియేటర్లలో సందడి మొదలు పెట్టిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్స్‌గా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మించగా.. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. తాను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పినట్లుగానే ఓ అందాల రాక్షసి మూవీ పెద్ద సక్సెస్ అయిందన్నారు. షెరాజ్‌ను చూసి చాలా మంది ప్రొడ్యూసర్స్ ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుదన్నారు. చిన్న సినిమా అయినా.. మంచి ఓపెనింగ్స్ వచ్చాయన్నారు. థియేటర్లలో సక్సెస్‌ పుల్‌గా నడుస్తోందని.. మౌత్ టాక్ పబ్లిసిటీతో షోలు, స్క్రీన్‌లు పెరుగుతున్నాయన్నారు. సినిమా జనాల్లోకి వెళ్లిపోయిందని.. సూపర్ రెస్పాన్స్ వస్తోందన్నారు. మరింత సక్సెస్ కావాలని ఆయన కోరుకున్నారు.

Add Zee News as a Preferred Source

అనంతరం రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ.. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని.. జనాల్లోకి మరింత రీచ్ కావాలని అన్నారు. ఈ సినిమాను నిలబెట్టేందుకు షెరాజ్ చాలా ప్రయత్నిస్తున్నారని.. తన రచన, స్క్రీన్‌ ప్లేను అందరూ మెచ్చుకుంటున్నారని చెప్పారు. తమ చిత్రానికి పెద్ద సక్సెస్ అందించిన ఆడియన్స్‌కు ఆమె థ్యాంక్స్ చెప్పారు.

షెరాజ్ మెహదీ మాట్లాడుతూ .. ఈ సినిమా మంచి సందేశం ఇచ్చేలా ఉందంటూ ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారని అన్నారు. తమ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోందని.. ఇంకా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. కృతి వర్మ మాట్లాడుతూ .. ఓ అందాల రాక్షసి సినిమాతోపాటు చాలా సినిమాలు థియేటర్లలోకి వచ్చాయని.. ఆడియన్స్ తమ సినిమాను ఆదరించారని అన్నారు. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. విహాన్షి హెగ్డే మాట్లాడుతూ.. తాను కుటుంబంతో కలిసి థియేటర్‌లో సినిమా చూశానని.. ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు ధన్యావాదాలు తెలిపారు.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News