ఈ సినిమా రానున్న 20 ఏళ్లు గుర్తుండిపోయిద్ది : కరుణాకరన్

తేజ్ ఐ లవ్ యూ సినిమా గురించి కరుణాకరన్ చెప్పిన ఆసక్తికరమైన విషయం

Last Updated : Jun 18, 2018, 10:46 AM IST
ఈ సినిమా రానున్న 20 ఏళ్లు గుర్తుండిపోయిద్ది : కరుణాకరన్

సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన తేజ్ ఐ లవ్ యూ సినిమా జులై 6వ తేదీన రిలీజ్‌కి రెడీ అవుతున్న తరుణంలో ప్రస్తుతం ఆ సినిమా యూనిట్ సభ్యులు ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే నిన్న ఆదివారం రాత్రి వైజాగ్‌లో తేజ్ ఐ లవ్ యూ ఆడియో సక్సెస్ మీట్ జరుపుకుంది ఆ సినిమా యూనిట్. ఈ వేడుకలో నటీనటులు తేజ్, అనుపమ, దర్శకుడు కరుణాకరన్, నిర్మాత కేఎస్ రామారావు, ఇతర సాంకేతిక నిపుణులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కరుణాకరన్ సినిమా గురించి మాట్లాడుతూ ''తేజ్ ఐ లవ్ యూ సినిమా రానున్న 20 ఏళ్లపాటు గుర్తుండిపోతుంది'' అని అన్నాడు. లవ్ స్టోరీ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరున్న కరుణాకరన్.. ఈ సినిమాలోనూ హదయాన్ని తట్టే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చాడు. 

 

జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ మళయాళం మ్యూజిక్ కంపోజర్ గోపీ సుందర్ ఈ సినిమాకు ట్యూన్స్ అందించారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పాటలు, టీజర్‌కి భారీ రెస్పాన్స్ లభించడంతో కరుణాకరన్ నుంచి మరోసారి మంచి లవ్ ఎంటర్‌టైనర్ వస్తుందని ఆడియెన్స్ ఆశిస్తున్నారు.

Trending News