close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ఇస్మార్ట్ శంకర్ సీక్రెట్ ఎలిమెంట్స్ ఎన్నో ...!!!

టీజర్ లో ఇస్మార్ట్ శంకర్ గురించి తెసుకుంది ఒక యాంగిలే.. తెలుసుకోవాల్సింది చాలా ఉంది.

Updated: May 16, 2019, 05:53 PM IST
ఇస్మార్ట్ శంకర్ సీక్రెట్ ఎలిమెంట్స్ ఎన్నో ...!!!

ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజా రిలీజ్ చేసిన టీజర్ అభిమానుల్లో  క్రూరియాసిటి తెగ పెంచేసింది. టీజర్ లో  హీరో క్యారెక్టర్ లోని అగ్రెసివ్ యాంగిల్ మాత్రమే  చూపించారు. ఈ మూవీలో  రామ్ యాంగిల్ ను చూడాలనుకున్న ఫ్యాన్స్ కి కొంచెం మాత్రమే ఊరటనిచ్చింది.  వాస్తవానికి సినిమా చుట్టూ క్యూరియాసిటీ రేజ్ చేస్తున్న సస్పెన్స్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ కథేంటి ? నిధి అగర్వాల్ రోల్ ఏంటి...?..ఎనర్జిట్ హీరోను తట్టకునే విలన్ ఎవరు ? హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ సంగతేంటి ? ఇలా ఎన్నో  సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి..

ఇస్మార్ట్ శంకర్ కథేంటి ..?  
ఇస్మార్ట్ శంకర్ సెట్స్ పైకి వచ్చినప్పటి నుండి ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందనే టాక్ నడుస్తుంది. నిజానికి ఈ టీజర్ లో కొద్దో గొప్పో స్టోరీలైన్ రివీల్ అవుతుందనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పటికీ ఈ విషయంలో కన్ఫర్మేషన్ రాలేదు.

నిధి అగర్వాల్  రోల్ ఏంటి ? 
 సినిమాలో ఇద్దరు హీరోయిన్స్… అందులో నిధి అగర్వాల్ సైంటిస్ట్ అనే టాక్ కూడా ఉంది. అలాగని కన్ఫమ్ గా చెప్పడానికి ఓ వర్కింగ్ స్టిల్ కానీ, మేకర్స్ నుండి అప్డేట్ కానీ ఏమీ లేదు. ఇప్పటికీ ఇది పెద్ద సస్పెన్సే. ఇలా ‘ఇస్మార్ట్ శంకర్’ లో సస్పెన్స్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి

ఎనర్జిటిక్ హీరోను తట్టుకునే విలన్ ఎవరు..?
సినిమాని ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం వల్ల పెద్దగా ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదా..? లేకపోతే పూరి ఈసారి కావాలని ఈ స్థాయిలో సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నాడా..? పక్కాగా తెలీదు కానీ ఈ సినిమాలో విలన్ ఎవరు..? ఎలా ఉండబోతున్నాడు అనే డీటేల్స్ కూడా ఇప్పటి వరకు ఎక్కడా బయటికి రాలేదు.

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్..?
టైటిల్ దగ్గరి నుండి రీసెంట్ గా రివీల్ అయిన హీరో క్యారెక్టరైజేషన్ వరకు పక్కా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ అని తెలుస్తుంది. పూరి పర్టికులర్ గా ఇలాంటి బ్యాక్ డ్రాప్ నే ఎంచుకోవడానికి రీజన్ ఏమై ఉంటుంది..? అసలు ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది..?

ఇలా ఇస్మార్ట్ శంకర్ మూవీకి సంబంధించి ఎన్నో సస్పెన్స్ ఎలిమెంట్స్ దాగి ఉన్నాయి. ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే మూవీ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి...

 

 

@ జీ సినిమాలు