టైటానిక్ -2 మళ్లీ అలరించనుందా..?

అందమైన ప్రేమ కావ్యం టైటానిక్ సినిమా గుర్తుందా.. !! 1997 నాటి సినిమా ..ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ప్రదర్శితమై.. సూపర్ హిట్ గా నిలిచింది. జేమ్స్ కామెరూన్ రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ..  ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల డాలర్లు వసూలు చేసి .. అప్పటి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తే ఎలా ఉంటుంది.

Updated: Feb 18, 2020, 04:44 PM IST

నిజానికి హాలీవుడ్ లో  ప్రతి సినిమాకు  సీక్వెల్స్ తీయడం చాలా సాధారణం. ఒక్కో సినిమాకు నాలుగైదు లేదా 9 వరకు సీక్వెల్స్ తీసిన చరిత్ర హాలీవుడ్ లో ఉంది. అలాంటిది టైటానిక్ కు సీక్వెల్ సినిమా రావడంలో తప్పేంటి...? ప్రస్తుతం నెట్టింట్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ .. అంటే టైటానిక్ - 2  వస్తోందని యూట్యూబ్ లో ఓ ట్రయిలర్ కూడా విడుదలైంది.

'2020'లోనే సినిమా విడుదల

గతేడాది నవంబర్ లో యూట్యూబ్ లో టైటానిక్-2 సినిమా ట్రెయిలర్ సందడి చేసింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా .. అని ప్రపంచవ్యాప్తంగా టైటానిక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ ట్రెయిలర్ లో చూస్తే టైటానిక్ -2 ద రిటర్న్ ఆఫ్ జాక్ .. ప్యారెడీ అని టైటిల్ పెట్టారు. ఈ వీడియో ఇప్పటి వరకు 15 మిలియన్ల వ్యూస్ దక్కాయి. ఇందులో జాక్ మళ్లీ వెనక్కి వచ్చినట్లుగా చూపించారు.

నిజానికి ఇది ఓ ఫేక్ ట్రెయిలర్. టైటానిక్ - 2 సినిమాను దర్శక నిర్మాతలు ప్రకటించలేదు. కానీ ఓ యూట్యూబ్ యూజర్ .. గ్రాఫిక్స్ తో చేసిన జిమ్మిక్కు ఇది.  అందుకే టైటిల్ చివరలో పేరడీ అని పెట్టారు. దీన్ని చూసి భ్రమపడ్డ నెటిజనులు టైటానిక్ -2 గురించి వెతకడం ప్రారంభించారు.