బహుముఖ ప్రజ్ఞాశాలి  గిరీష్‌ కర్నాడ్‌  ఇక లేరు...ప్రస్థానం ఇదే

బహు బాషా నటుడు గిరీష్ కర్నాడ్ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు

Last Updated : Jun 10, 2019, 12:16 PM IST
బహుముఖ ప్రజ్ఞాశాలి  గిరీష్‌ కర్నాడ్‌  ఇక లేరు...ప్రస్థానం ఇదే

ప్రముఖ నటుడు గిరీస్ కర్నాడ్ (81) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  ఈ రోజు ఉదయం 6.30 గంటలకు  బెంగళూరులో తన నివాసంలో కన్నుమూశారు. గిరీష్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని పలువురు సినీ ప్రముఖులు పేర్కొన్నారు. గిరీష్ మృతి పట్ల దిగ్భాంత్రి వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబానికి తమ ప్రగఢా సానుభూతి తెలిపారు.  ఆయన భౌతిక కాయాన్ని దర్శించుకునేందుకు భారీగా సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. 

గిరీష్ ప్రస్థానం ఇదే...
గిరీష్‌ కర్నాడ్‌ పూర్తి పేరు గిరీష్‌ రఘునాత్‌ కర్నాడ్‌. ఆయన 1938లో మే 19న మహారాష్ట్రలోని మథేరన్‌ ప్రాంతంలో జన్మించారు. గిరీస్ కర్నాడ్ స్వశక్తితో అంచెలంచెలుగా ఎదుగుతూ సాహితీ రంగం, సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు నలభై ఏళ్ల సినీ కెరీర్‌లో నటుడిగా, దర్శకుడిగా, రచయితగా గిరీష్‌ కర్నాడ్‌ ఎంతో పేరు తెచ్చుకున్నారు. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులు మెప్పించారు. ముఖ్యంగా తెలుగులో ప్రేమికుడు, రక్షకుడు, ధర్మచక్రం, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ వంటి హిట్  చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా గిరీష్‌ కర్నాడ్ చివరిగా నటించిన కన్నడ  చిత్రం అప్నా దేశ్  ఆగస్టు 26న విడుదల కాబోతోంది. 
అవార్డులు ఇవే...
నటనతో పాటు ఆయన హిట్ చిత్రాలకు  పలు  దర్శకత్వం కూడా వహించారు. దీంతో పాటు రచాయితగా కూడా గిరీస్ మంచి గుర్తింపు సంపాదించారు. పలు పుస్తకాలను రచించడంతో పాటు ఇంగ్లీష్ పుస్తకాలను వివిధ భాషల్లో తర్జుమా చేశారు. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన ఆయన తనకు ప్రవేశ ఉన్న  అన్ని విభాగాల్లోనూ ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు.  రచయితగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్‌ అవార్డు ఆయనకు వరించింది. సాహితీ రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌ అవార్డులతో సత్కరించింది. సినీ పరిశ్రమలో నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో ఆయనను వరించాయి. 

Trending News