ఆ బాలీవుడ్ భామ "పదేళ్ల ఛాలెంజ్'' ఏమైందో వింటే షాక్

నెటిజన్ల సెటైర్ల దెబ్బకు బాలీవుడ్ భామ మలైకా ఆరోరా ఏకంగా తన పోస్టునే మార్చేసింది

Last Updated : Jan 20, 2019, 01:31 PM IST
ఆ బాలీవుడ్ భామ "పదేళ్ల ఛాలెంజ్'' ఏమైందో వింటే షాక్

చల్ ఛయ్యా ఛయ్యా ఛయ్యా ..చల్ ఛయ్యా ఛయ్య ఛయ్యా.. ఈ పాట అందరీ గుర్తుండే ఉంటుంది కదూ..అదేనండి బాలీవుడ్ బాడ్ షా   ‘దిల్‌సె’ సినిమాలోని పాట. గూడ్స్ రైలుపై ప్రయాణం చేస్తూ సాగే ఈ పాటలో షారూక్ తో పాటు మలైకా ఆరోరా షారుఖ్ ఖాన్ చేసిన డాన్స్ ఇప్పటికీ కుర్రకారు మదిలో మొదలుతూనే ఉంటోంది. ఇంతకీ ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందనే ఈ పాటకు సంబంధించి పోస్టుపై నెటిజెన్లు సైటైర్లు సంధించారు.. ఈ విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే...

ఇక్కడే వచ్చింది అసలు చిక్కు...

ప్రస్తుతం  " 10 ఇయర్ ఛాలెంజ్ " పేరుతో సోషల్ మీడియాలో ఓ ఛాలెంజ్ బాగా వైరల్ అవుతోంది. దీనిలో భాగంగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా తమ 10 ఏళ్ల నాటి ఫోటోలు...  ప్రస్తుత ఫోటోలు పక్కపక్కన పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా 46 ఏళ్ల ప్రముఖ నటి మలైకా ఆరోరా బాలీవుడ్ బాద్షా షారూక్ సరసన 1998లో రిలీజ్ అయిన '' దిల్ సె'' మూవీలోని ''చల్ ఛయ్య ఛయ్యా''  స్పెషల్ సాంగ్  లోని తనను తాజా స్టిల్స్‌తో జత చేసి పోస్ట్ చేసింది. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు..

సరిగ్గా ఇక్కడే పప్పులో కాలేసిన ముద్దుగుమ్మ
 వాస్తవానికి దిల్ సే  సినిమా రిలీజ్ అయి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. కానీ మలైకా ఆరోరా మాత్రం ఈ ఫోటో పోస్టు చేసి  ‘ మై 10 ఇయర్ ఛాలెంజ్’.. గత పదేళ్లు అద్భుతంగా ముగిశాయి. రాబోతున్న పదేళ్ల కోసం ఎదురు చూస్తున్నా అంటూ కామెంట్ చేసింది. ఈ పోస్టుపై నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. నెటిజన్ల వేసిన సెటైర్ల పరిశీలిద్దాం..

సెటైర్ల వర్షం...

"2018 మధ్య ఎన్ని సంవత్సరాలు ఉంటాయో కూడా తెలియదా?"
"పదేళ్లంటూ ఇరవై ఏళ్ల ఫోటోను షేర్ చేస్తావా?"
"ఏకంగా అందం ఉంది కానీ తెలివి ఏ మాత్రం లేదు"

యూ టర్న్ తీసుకున్న భామ

ఇలా నెటిజన్లు సెటర్ల వర్షం కురిపిస్తుండతో తట్టులోక ఏకంగా తన పోస్టునే మార్చేసింది ఈ ముద్దుగుమ్మ . మళ్లీ తన  " 10 ఇయర్ ఛాలెంజ్ "ను " 20 ఇయర్ ఛాలెంజ్ "  మార్చింది. నెటిజన్లా మాజాకా !!

 

Trending News