close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

'గ్యాంగ్ లీడర్' తో ఈ యంగ్ మ్యూజిక్ డైరక్టర్ ఉపందుకునేనా ?

కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్న యంగ్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుద్..ఇప్పుడు తన దృష్టి టాలీవుడ్ పై పెట్టాడు.

Updated: Aug 19, 2019, 03:13 PM IST
'గ్యాంగ్ లీడర్' తో ఈ యంగ్ మ్యూజిక్ డైరక్టర్ ఉపందుకునేనా ?

కోలీవుడ్‌లో ఓ రేంజ్ లో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న యంగ్ మ్యూజిక్ సంచలనం అనిరుద్... టాలీవుడ్ లో పాగా వేసేందుకు మాత్రం తెగ కష్టపడుతున్నాడు. ‘అజ్ఞాత వాసి’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనిరుద్ కి  ఆ సినిమా సక్సెస్ అందించలేకపోవడం కాస్త నిరాశకు గురిచేసింది. అయితే కొంత గ్యాప్ తీసుకొని నానీ హీరోగా నటించిన ‘జెర్సీ’ద్వారా టాలీవుడ్ లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ అందుకున్పప్పటికీ టాలీవుడ్ నుంచి  ఆఫర్లు రాలేదు . కాగా కొంత గ్యాప్ తర్వాత అనిరుద్ కు మళ్ళీ నానినే ‘గ్యాంగ్ లీడర్’కి అవకాశం ఇచ్చాడు. మరి గ్యాంగ్ లీడర్ తర్వాత అయినా అనిరుద్ టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చి పడాతాయో లేదో చూడాల్సి ఉంది.