close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

''రాజుగారి గది''లోకి వచ్చే ఛాన్స్ ఎవరికి దక్కేను ?

''రాజుగారి గది -3'' మూవీలో స్టార్ హీరోయిన్ వేటలో పడ్డారు చిత్రయునిట్

Updated: Jul 8, 2019, 01:35 PM IST
''రాజుగారి గది''లోకి వచ్చే ఛాన్స్ ఎవరికి దక్కేను ?

''రాజుగారి గది -3'' మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మిల్లీ బ్యూటీ తమన్న.. డేట్స్ సర్దుబాటు చేసుకోలేక సడన్ గా తప్పుకుంది. ఆల్మోస్ట్ సినిమా సెట్స్ పైకి వచ్చేస్తుందనుకున్న టైమ్ లో ఈ పరిణామం చిత్ర యూనిట్ కు షాక్ కు గురించేంది. సరే ఎదో జరిపోయింది ఇప్పుడు మిల్కీ బ్యూటీ స్థానంలో మరో హీరోయిన్ వేటలో పడ్డారు. అయితే ఇప్పుడు ఆప్లేస్ ఎవరు భర్తీ చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.

రాజుగారి గది లో నాగార్జున లీడ్ స్పేస్ లో ఉన్నారు.. పైగా ఈ కథ మొత్తం తిరిగేది హీరోయిన్ చుట్టే.. కాబట్టి సాదాసీదా హీరోయిన్ అయితే అస్సలు కుదరదు.. అందుకే కాస్త టైమ్ పట్టినా పర్వాలేదు కానీ, స్టార్ హీరోయిన్ అయితేనే బెటర్ అని ఫిక్సయి ఉంది చిత్రయూనిట్.. చూడాలి మరీ చివరికి ఎవరిని సెట్స్ పైకి తీసుకు వస్తారో…

ఇదిలా ఉంటే రాజుగారి గది 2 లో అక్కినేని సమంతని ప్రిఫర్ చేసిన దర్శకుడు ఓంకార్... దానికి సీక్వెల్ గా వస్తున్న రాజుగారి గది 3 మూవీకి కూడా అదే రేంజ్ స్టార్ హీరోయిన్ ని ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడట. అందుకే సీన్ లోకి తమన్నా వచ్చింది. ఇప్పుడు అది కుదరడం లేదు కాబట్టి…ఈ వరసలో నెక్స్ట్ ఎవరుంటారు..? అనే ప్రశ్న ఇక్కడ రైజ్ అయింది.

ఆల్రెడీ ఈ ఫ్రాంచైజీలో సమంతా చేసేసింది కాబట్టి ఈ వరసలో నెక్స్ట్ ఇమ్మీడియట్ గా వచ్చే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. మరి ఓంకార్ కూడా అదే యాంగిల్ లో ఆలోచిస్తాడా..? ప్రస్తుతానికయితే ఈ స్పేస్ లో తాప్సీ పేరు కూడా వినిపిస్తుంది. మరి రాజుగారి గదిలోకి తమన్న ప్లేస్ లో కాజల్ వస్తుందా లేదా తాప్పి అవకాశాన్ని దక్కించుకుంటుందా అనేది దానిపై ఉత్కంఠత నెలకొంది.