కోట్లాది ఫాలోవర్స్ ఉన్న లెజెండ్ 'BOO'పెట్ ఇక లేదు 

ప్రపంచంలోని అత్యంత క్యూట్ డాగ్ గా పేరు సంపాదించిన బూ తుదిశ్వాస విడిచింది

Updated: Jan 20, 2019, 02:18 PM IST
కోట్లాది ఫాలోవర్స్ ఉన్న లెజెండ్ 'BOO'పెట్ ఇక లేదు 

ఫేస్‌బుక్ సంచలనం...ప్రపంచంలోనే క్యూట్ డాగ్ పేరు సంపాదించిన  'బూ' పెట్  ఇక లేదు.  గుండె వ్యాధితో బాధపడుతున్న శునకం  నిన్న మధ్యాహ్నం 12 గంటల సమమంలో తుదిశ్వాస విడిచింది. యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. 2017లో 'BOO' సహచర కుక్క BUDDY మరణించిందట. అప్పటి నుంచి దాని ఆరోగ్యం సరిగా లేదు. దీంతో ‘బూ’ శుక్రవారం ఉదయం నిద్రలోనే చనిపోయిందని దాని యజమాని ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. 

కోట్ల మంది అభిమానులు

సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం రెగ్యూలర్ గా ఫాలో అయ్యే వారికి 'BOO' గురించి చెప్పాల్సిన పనిలేదు. దీనికి 16 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఆశ్చర్యమేస్తుంది కదూ.. . ఈ శునకానికి ఫేస్‌బుక్‌లో ప్రత్యేకంగా ఓ అకౌంట్ ఉంది. ఏ జంతువుకూ లేనంతమంది ఫాలోవర్స్ BOO సొంతం. 

'BOO"కు సంతాపం..

బూ మరణంతో యాజమాని తీవ్రంగా రోధిస్తున్నారు.. BOOతో  గడిపిన మధుర క్షణాలు తాను మరిచిపోలేనని..మళ్లీ దాన్ని స్వర్గంలో కలుసుకుంటానని అదేదనతో కూడిన స్వరంతో పేర్కొన్నాడు. కాగా బూ మరణ వార్త విన్న ఫాలోవర్స్ లక్షల సంఖ్యలో సంతాపం తెలిపారు. రియల్లీ వి మిస్ యు BOO అంటూ కామెంట్స్ పెడుతున్నారు. BOO అందించిన ఎంటర్ టైన్ మెంట్ ఇక ఉండకపోవచ్చని ఫాలోవర్స్ దిగులు చెందుతున్నారు.