వినియోగదారులకు గమనిక; వాట్సాప్ లో భారీ మార్పులు !!

వాట్సాప్ వినియోగదారులకు ముఖ్య గమనిక

Updated: Aug 19, 2019, 06:37 PM IST
వినియోగదారులకు గమనిక; వాట్సాప్ లో భారీ మార్పులు !!

త్వరితగతిన చాటింగ్ చేసేందుకు వీలు కల్పించే యాప్  ''వాట్సాప్'' ' సరికొత్త పేరుతో కనిపించబోతోంది. ఇక నుంచి '' వాట్సాప్ బై ఫేస్ బుక్ ''గా దర్శనమివ్వనుంది.  ప్రస్తుతం వాట్సాప్ బీటా వెర్షన్ వినియోగదారులకు కొత్త పేరుతో కనిపిస్తోంది. త్వరలోనే ఇది అందరు వినియోగదారులకు దర్శనమివ్వనుంది.

ఐదేళ్ల కిందట వాట్సాప్ ను  ఫేస్ బుక్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ యాప్ లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తన పేరు జత చేసి వాట్సాప్ బై ఫేస్ బుక్ గా నామకరణం చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. మరిన్ని వివరాల కోసం సంబంధిత వెబ్ సైట్ చూడగలరు