Almonds VS Walnuts Benefits: ఉదయం పడగడుపున గింజలు తీసుకోవాలి అని అంటారు. నానబెట్టినవి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు. మెదడు అభిజ్ఞ పని తీరును మేలు చేస్తుంది. అయితే బాదం లేదా వాల్నట్స్ నానబెట్టింది ఏది బెట్టర్ తెలుసుకుందాం..
బాదం పప్పులో విటమిన్ ఇ పవర్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మెదడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతాయి. ఆరోగ్యకరమైన కోవ్వులు, ప్రోటీన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెదడు అభిజ్ఞ పని తీరును కూడా ఇది మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన నరాల పనితీరు కూడా ఇవి సహాయపడుతుంది. నానబెట్టిన బాదంపప్పు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇందులో యాంటీ న్యూట్రియన్స్ సమస్యను తగ్గిచేస్తుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బాదంపప్పులో సహజ సిద్ధంగా విటమిన్ ఇ ఉంటుంది. ఇది నానబెట్టి తీసుకోవడం వల్ల స్ట్రెస్ సమస్యను తగ్గిస్తుంది.
నానబెట్టిన వాల్నట్స్ తీసుకోవడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అందుతాయి. అంతే కాదు ఇందులో ఆల్ఫా లైనోలిక్ యాసిడ్ (ALA) ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యకరమైన పనితీరుకు మేలు చేస్తుంది. అంతేకాదు వాల్నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది ఇన్‌ఫ్లమేషన్ సమస్యను తగ్గిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒమేగా ౩ ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ సెల్స్‌కు ఎంతో ముఖ్యం. ప్రధానంగా ఆల్జీమార్ సమస్యను తగ్గిస్తుంది. మెదడు పనితీరు మరింత మెరుగవుతుంది. కొన్ని నివేదికల ప్రకారం ఇది సమస్యను కూడా తగ్గించింది. ఆక్సిడెంట్ నుంచి కాపాడుతుంది. వయససు రీత్యా వచ్చే వృద్ధాప్య సమస్యల నుంచి ఇది నివారిస్తుంది. అంతేకాదు స్ట్రెస్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
వాల్నట్స్ లేదా బాదం రెండిట్లో ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉంటాయి. రెండిట్లో ఏది లేదా కలిపి తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్లు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉండాలంటే వాల్నట్స్ తీసుకోవాలి. బాదంలో ప్రోటీన్ విటమిన్ ఇ సహజసిద్ధంగా ఉంటుంది.
READ ALSO: Drumstick: మునగకాయలతో ఎండాకాలం 5 అద్భుతమైన ప్రయోజనాలు ..
READ ALSO: ఈరోజు రాశిఫలాలు.. నేడు ఈ రాశికి ప్రతి పనిలో ఇబ్బందులు తప్పవు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









