)
Amla And Turmeric Shot: అర్టెరీ బ్లాక్ అవ్వడం వల్ల గుండెపోటు సమస్యలు వచ్చి ప్రాణాలు పోతున్నాయి. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు సమస్యలు వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా అర్టెరీ బ్లాక్ అనేది మనకు ముందుగా తెలియకుండా ఉంటుంది. ఒకేసారి హఠాత్తుగా సంభవించడంతో ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే గుండె ప్రమాదాలు రాకుండా ఉండటానికి మన డైట్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది అర్టెరీ గోడలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. పసుపులో ఉండే కర్కూమీన్ నొప్పుల సమస్యలను తగ్గించి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది..
ఉసిరి పసుపు కలిపిన షాట్ తీసుకోవటం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. తద్వారా అర్టెరీ బ్లాక్ కాకుండా ఉంటుంది. ట్రై గ్లైజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది. పసుపు మంట సమస్యను తగ్గించేస్తుంది. రక్త సరఫరాను కూడా మెరుగు చేస్తుంది.
ఈ షాట్ తీసుకోవడం వల్ల బిపి అదుపులో ఉండి రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. స్ట్రెస్ మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆ రక్తనాళాలు నీరసించిపోతాయి. అయితే ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు కలిపి ఇవి ఎండోటేలియల్ పనితీరును కూడా మెరుగు చేస్తుంది.
పసుపులో ఉండే కర్కుమీన్ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది నరాల పనితీరును మెరుగు చేస్తుంది. రక్తనాళాలను ఉపశమనం కలిగించే గుణం కలిగి ఉంటుంది.రక్తనాళాలు ఉపశమనం కలిగించడానికి నైట్రిక్ ఆక్సైడ్ ఎంతో ముఖ్యం ఇది రక్త సరఫరాను కూడా మెరుగు చేస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం ఉసిరిలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలు పెంచే గుణం ఉంది. పసుపు నైట్రిక్ ఆక్సైడ్ విడిపోకుండా కాపాడుతుంది. ఈ రెండు కలిపి బ్లడ్ ప్రెషర్ ని అదుపులో ఉంచుతాయి
అయితే ఆక్సిటీవ్స్ స్ట్రెస్ రాకుండా కాపాడుకోవాలి. ప్రధానంగా కాలుష్యం, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవటం వల్ల ఫ్రీ రాడికల్ డామేజ్ అవుతుంది. దీంతో పాటుగా వ్యవస్థపై బలమైన ప్రభావం పడుతుంది. ఉసిరి, పసుపు తీసుకోవడం వల్ల ఇది మన గుండెకు ఒక షీల్డ్ ఇలా పనిచేస్తుంది. అర్టెరీ బ్లాక్ కాకుండా కాపాడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook