Amla Remedies: తరచూ మూత్రం వస్తోందా, ఉసిరి రోజూ ఇలా తింటే చాలు

Amla Remedies: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఆరోగ్యానికి కావల్సిన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో అంతర్గతంగా ఎదురయ్యే కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా ప్రకృతిలో ఉందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 4, 2025, 10:37 PM IST
Amla Remedies: తరచూ మూత్రం వస్తోందా, ఉసిరి రోజూ ఇలా తింటే చాలు

Amla Remedies: కొంతమందికి మూత్రం తరచూ వస్తుంటుంది. చాలామంది ఈ సమస్యను అంతగా పట్టించుకోరు. కొంతమంది వివిధ రకాలుగా మందులు వాడినా ప్రయోజనం కన్పించదు. అయితే ప్రకృతిలో విరివిగా లభించే ఉసిరితో ఈ సమస్యను చాలా సులభంగా తగ్గించవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.

Add Zee News as a Preferred Source

ఆయుర్వేదం ప్రకారం ఉసిరిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇందులో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. పోషకాలతో సమృద్ధిగా ఉంటే ఉసిరి క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా చాలా రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కారణంగా క్రమం తప్పకుండా తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు దూరమౌతాయి. అంటే ఏజీయింగ్ ప్రక్రియను నియంత్రిస్తుంది. శరీరం ఇమ్యూనిటీ గణనీయంగా పెరగడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఆయుర్వేద వైద్యశాస్త్రం ప్రకారం రోజూ ఒక ఉసిరి తినడం వల్ల చాల వ్యాధులను దూరం చేయవచ్చు. చర్మం నిగారింపు, కంటి ఆరోగ్యం, కేశాలకు బలం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. 

వివిధ రకాల ఆహారపు అలవాట్లు ఇతర కారణాలతో కొంతమందికి తరచూ యూరిన్ రావడం లేదా యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్లు తలెత్తడం ఉంటుంది. ఈ సమస్యకు ఉసిరి అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. శరీరం నుంచి చెడు బ్యాక్టీరియాను ఉసిరి అంతం చేస్తుంది. యూరినరీ ట్రాక్‌ను శుభ్రం చేస్తుంది. ఉసిరి జ్యూస్ లేదా పౌడర్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 

ఉసిరి రోజూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉసిరి జ్యూస్ తాగడం వల్ల కడుపులో అల్సర్, ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా డైజెస్టివ్ ఎంజైమ్‌ను యాక్టివ్‌గా ఉంచడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. ఉసిరిలో ఫైబర్ ఎక్కువగా ఉండి మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఏజీయింగ్ సమస్య దూరమౌతుంది. చర్మం దీర్ఘకాలం యౌవనంగా, నిగనిగలాడుతూ ఉంటుంది. కొంతమందికి వాంతులు, వికారం సమస్యగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు ఉసరి పౌడర్‌ను కొద్దిగా తేనెతో కలిపి చప్పరిస్తే తక్షణం ఉపశమనం లభిస్తుంది. 

కిడ్నీలో రాళ్ల సమస్యకు ఉసిరి బెస్ట్ మెడిసిన్ అని చెప్పవచ్చు. శరీరం నుంచి విష పదార్ధాలను అద్భుతంగా దూరం చేస్తుంది. యూరినరీ బ్లేడర్‌ను పూర్తిగా క్లీన్ చేస్తుంది. రాళ్ల సమస్య ఉంటే తొలగిస్తుంది.

Also read: Indian Army Jobs: రాత పరీక్ష లేకుండానే 2 లక్షల జీతంతో ఆర్మీలో ఆఫీసర్ ఉద్యోగాలు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News