Avocado: అవకాడో మన శరీరానికి చేసే అద్భుతాలు తెలుసా? నమ్మలేని ప్రయోజనాలు..

Avocado Health Benefits: అవకాడో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండు. ఇది ఒక సూపర్ ఫుడ్ అని కూడా చెప్పాలి. దీనికి చాలామంది లవర్స్ కూడా ఉన్నారు. వీళ్లు అమితంగా అవకాడో తింటారు. అయితే ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి. అందుకే దీనికి ప్రధాన కారణం ఈ బట్టర్‌ ఫ్రూట్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Feb 28, 2025, 06:03 PM IST
Avocado: అవకాడో మన శరీరానికి చేసే అద్భుతాలు తెలుసా? నమ్మలేని ప్రయోజనాలు..

Avocado Health Benefits: అవకాడోలో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.. అవకాడో తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జియాంథీన్‌ లూటీన్‌ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  హానికర సూర్యుని కిరణాల నుంచి మన కంటిని కాపాడుతాయి. ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా నివారిస్తాయి. తరచూ అవకాడో తీసుకోవడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయి..

Add Zee News as a Preferred Source

అవకాడో రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వల్ల ఇది మనకు మంచి ప్రయోజనాలు కలిగిస్తుంది.. ముఖ్యంగా అవకాడోలో పొటాషియం బ్లడ్ ప్రెజర్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అంతే కాదు ఇందులో ఫైబర్ ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తుంది. దీంతో మన కార్డీయో ఆరోగ్యం  కూడా బాగుంటుంది. మన డైలీ డైట్ లో అవకాడో చేసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి..

అవకాడోలో కొవ్వు అతిగా ఉంటుందేమో అని చాలా మంది అనుకుంటారు.. బరువు తగ్గాలని చూసేవారు అవకాడో తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కల్పిస్తుంది.. దీంతో అతిగా తినకుండా ఉంటారు. క్యాలరీలు తక్కువ మోతాదులే ఉంటాయి. ఇది మంచి స్నాక్ రూపంలో తీసుకోవచ్చు. అవకాడోలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను బలంగా మారుస్తాయి..

ఇదీ చదవండి: మార్చి 1వ తేదీ నుంచి కొత్త రూల్స్‌.. ముందుగానే తెలుసుకోండి..

అవకాడో తీసుకోవడం వల్ల మనం ముఖం కూడా ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది. ఇది చర్మానికి మంచి హైడ్రేషన్ అందించి.. సాగేలా చేస్తుంది. ముఖంపై ఉండే మచ్చలు, గీతలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే అవకాడోలో విటమిన్ ఇ, విటమిన్ సి కూడా ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల మన చర్మం డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అంతేకాదు ముఖం కాంతివంతం కూడా అవుతుంది.

ఇదీ చదవండి:  ఈ జ్యూస్‌ తాగితే గుండె ఆరోగ్యం.. నిత్య యవ్వనం, మలబద్దకం పరార్..

అవకాడో తీసుకోవడం వల్ల స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. ఇది మూడ్ బూస్టింగ్ గుణాలు కలిగి ఉంటుంది. అవకాడో విటమిన్ డీ, ఫోలెట్‌ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు ఇది డిప్రెషన్ రాకుండా నివారిస్తుంది. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో  ఉంచుతాయి. అవకాడో తీసుకోవడం వల్ల ఇందులోని ఫైబర్ ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. మైక్రోబియం కూడా అవకాడో తీసుకోవడం వల్ల సమతులం అవుతుంది. జీర్ణ వ్యవస్థ బలంగా మారుతుంది మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అవకాడో స్మూథీ రూపంలో తీసుకోవచ్చు. లేదంటే నేరుగా తేనె వేసుకుని తింటారు. అవకాడో జ్యూస్‌ కూడా అద్భుతంగా ఉంటుంది.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News