Barley Water: బార్లీ నీటి వేసవిలో తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Barley Water Benefits In Telugu: ప్రతి రోజు బార్లీ నీటిని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించేందుకు సహాయపడుతుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 5, 2025, 03:50 PM IST
Barley Water: బార్లీ నీటి వేసవిలో తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Barley Water Benefits: ప్రతి రోజు బార్లీ నీరు తాగుతూ ఉంటారు. ఈ నీటిని ఉదయం పూట తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ కప్పు (240 ml) బార్లీ నీటిలో సుమారుగా కేలరీలు 50తో పాటు ప్రోటీన్ 1 గ్రాము, కార్బోహైడ్రేట్లు 12 గ్రాములు, ఫైబర్ 2 గ్రాములు, పొటాషియం 78 మి.గ్రా లభిస్తాయి. కాబట్టి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ బార్లీ వాటర్‌ తాగితే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియతో పాటు ఇతర పొట్ట సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు ఈ వాటర్‌ తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

ఈ లాభాలు కలుగుతాయి:
జీర్ణక్రియ సమస్యలు: 

బార్లీ వాటర్‌లో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి రోజు ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం తగ్గడమే కాకుండా జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.. ఈ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలు కూడా తొలగిపోతాయి. 

శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది: 
బార్లీ నీరులో మూత్రవిసర్జనను పెంచే అనే గుణాలు ఉంటాయి. కాబట్టి ఈ నీటిని తాగితే..శరీరంలోని విష పదార్థాలు కూడా బయటకు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. దీంతో పాటు కిడ్నీల్లో రాళ్ల సమస్యలు కూడా తగ్గుతాయి.

బరువు తగ్గడానికి..: 
బార్లీ నీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉండడమే కాకుండా ఫైబర్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది.. ఇది రోజు తాగితే పొట్ట నిండుగా తయారవుతుంది. అంతేకాకుండా కడుపు నిండిన అనుభూతిని కలిగుతుంది. దీని కారణంగా ఆహారం తీసుకోవడం తగ్గిపోయి.. సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

రక్తంలో చక్కెర స్థాయిలు: 
బార్లీ నీటిలో బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ అధిక మోతాదులో లభిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి లేదా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా డయాబెటిస్‌ కూడా సులభండా తగ్గుతాయి.

కొలెస్ట్రాల్ స్థాయిలు: 
బార్లీ నీటిలోని బీటా-గ్లూకాన్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని ద్వారా గుండె సమస్యలు కూడా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా తొలగిపోతాయి.

శరీర హైడ్రేటెడ్‌ కోసం: 
సాధారణ బార్లీ నీరు ఉదయాన్నే తాగడం వల్ల శరీరం కూడా చాలా హైడ్రేటెడ్‌ ఉంటుంది. దీని కారణంగా వేసవిలో ఈ డ్రింక్‌ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా వ్యాయామాలు రోజు చేసేవారు దీనిని తాగడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News