Barley Grass Juice: బార్లీ గడ్డి జ్యూస్ రోజూ తాగితే...ఆ సమస్య తలెత్తదా
మన చుట్టూ ఉండే మొక్కలు, ధాన్యరాశుల్లో మనకే తెలియని ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. విటమిన్స్, పోషక పదార్ధాల కోసం మందుల్ని ఆశ్రయించడం కంటే మనకు దొరికే వాటితోనే అద్భుత ప్రయోజనం పొందవచ్చు. అందులో ఒకటి బార్లీ గడ్డి.
మన చుట్టూ ఉండే మొక్కలు, ధాన్యరాశుల్లో మనకే తెలియని ఎన్నో ఔషధ గుణాలు ( Medicinal values ) దాగున్నాయి. విటమిన్స్ ( Vitamins ), పోషక పదార్ధాల కోసం మందుల్ని ఆశ్రయించడం కంటే మనకు దొరికే వాటితోనే అద్భుత ప్రయోజనం పొందవచ్చు. అందులో ఒకటి బార్లీ గడ్డి ( Barley Grass ).
గోధుమ గడ్డి ( Wheat Grass ) గురించి వినే ఉంటారు. గోధుమ గడ్డిలో ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణ సమస్య పోతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటివి తొలగిపోతాయి. కడుపులో వికారం ఉన్నా, వాంతులు ఉన్నా గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగవచ్చు. అంతేకాదు గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తీసుకోవడం ద్వారా పైల్స్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. జింక్, మెగ్నిషియం వంటి పోషకాలు గోధుమ గడ్డిలో పుష్కలంగా లభిస్తాయి.
అదే విధంగా ఇప్పుడు బార్లీ గడ్డి ( Barley Grass ) కూడా ఓ అద్భుత ఔషధంగా ఉంది. బారీ గడ్డిలో మన శరీరానికి కావల్సిన అమైనో యాసిడ్లు ( Amino Acids ) , క్లోరోఫిల్, యాంటీ ఆక్సిడెంట్లు ( Anti Oxidants ), మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటి ద్వారా వివిధ రకాల అనారోగ్య సమస్యల్నించి విముక్తి పొందవచ్చు. అంతేకాదు రోజూ క్రమం తప్పకుండా బార్లీ గడ్డి జ్యూస్ ( Barley Grass Juice ) సేవిస్తే..రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
బార్లీ గడ్డిలో ఉండే ఫ్లేవనాయిడ్లు అంటే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చాలా మేలు చేకూరుస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉత్పన్నమయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. బెస్ట్ యాంటీ యాక్సిడెంట్ ( Best Anti Oxidant ) కావడంతో ఏజీయింగ్ ప్రాసెస్ అంటే వయస్సు మీరిన ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా మనం తినే ఆహారంలో నుంచి అధికంగా శక్తి ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. శరీరంలోని కణజాలాన్ని బార్లీ గడ్డి జ్యూస్ ద్వారా లభించే యాంటీ యాక్సిడెంట్లు రక్షిస్తాయి. క్యాన్సర్ ( Cancer ), గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల్ని రాకుండా చేస్తాయి.
డిప్రెషన్ ( Depression ) అంటే ఆత్మ న్యూనతతో బాధపడేవారు బార్లీ గడ్డి జ్యూస్‌ను ప్రతిరోజూ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. బార్లీ గడ్డిలో ఉండే న్యూరోట్రోఫిన్ అనే సమ్మేళనం డిప్రెషన్ బారి నుంచి కాపాడుతుంది. మరీ ముఖ్యంగా షుగర్ లెవెల్స్ ( Diabetes ) అదుపులో ఉంటాయి. కిడ్నీ సమస్యలు, కంటి చూపు సమస్య తలెత్తదు. Also read: Health Tips: గుండెపోటు.. ‘గోల్డెన్ అవర్’ చాలా కీలకం.. ఎందుకో తెలుసా?