Dates And Cashew Benefits: ఖర్జూరం జీడిపప్పులో అనేక రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేద పరంగా ఉపయోగిస్తున్నారు. మన పూర్వీకుల డైట్‌లో కూడా ఉన్నాయి. ఇది మెదడు పనితీరును మెరుగు చేసి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ప్రతిరోజు మూడు ఖర్జూరాలు ఐదు బాదం పప్పులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
రోజు ఉదయం ఈ ఆరోగ్యకరమైన స్నాక్ తీసుకోవటం వల్ల ఇది మన నేచురల్‌గా గ్లూకోజ్ అందుతుంది. అందిస్తుంది ఇది కాకుండా తక్షణ శక్తిని కూడా అందిస్తుంది ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి మన గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.
ప్రతిరోజు బాదం తీసుకోవడం వల్ల ఇది మెదడు పనితీరును మెరుగు చేస్తుంది. ఖర్జూరం కలిపి బాదంతో తీసుకుంటే విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్షణ కవచంలా నిలుస్తాయి. ఇది మెదడు అభిజ్ఞ పని తీరును మెరుగు చేస్తాయి. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి.
రెగ్యులర్ గా ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. ఇందులో నయం చేసే గుణాలు ఉంటాయి. ప్రధానంగా ఇందులో ఫైబర్ ఉండటం వల్ల దీర్ఘకాలిక మలబద్దక సమస్యకు ఎఫెక్టివ్ రెమిడీ. ఖర్జూరం, జీడిపప్పు కలిపి తీసుకుంటే ఆరోగ్యకరమైన మంచి బ్యాక్టీరియా పెరగడానికి పోషణ అందిస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి మెరుగు చేస్తుంది. ఖనిజాలు త్వరగా గ్రహించడంలో సహకారం అందిస్తాయి.
అంతేకాదు బరువు నిర్మహణలో ఉన్నవారు ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యకరమైన ఆహారం అవుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కల్పిస్తుంది. తద్వారా అతిగా చిరుతిళ్లు తినకుండా ఉంటారు. అనారోగ్య సమస్యల బారిన పడరు. బరువు పెరగకుండా ఉంటారు..
బాదం, ఖర్జూరం కలిపి ప్రతి రోజు ఉదయం తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కూడా ప్రేరేపిస్తుంది. ఇందులో బయోటిన్, విటమిన్ ఇ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. వృద్ధాప్య సమస్యలు త్వరగా కనిపించవు. అంతేకాదు స్కిన్ సాగే గుణాన్ని అందించి ఈ ఎండాకాలం హైడ్రేటెడ్ గా ఉండేలా ప్రేరేపిస్తుంది. సాధారణంగా మనం ఉపవాసం ఉన్నప్పుడు ఖర్జూరంతోనే విరమిస్తాం. ఎందుకంటే ఇవి తక్షణ శక్తి అందిస్తాయి. రోజూ ఉదయం తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. అంతేకాదు ఖర్జూరం, జీడిపప్పు ఉపయోగించి లడ్డూ తయారు చేసుకుంటారు. దీంతో మీ గుండె కూడా బలంగా మారుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంటుంది.
ఇదీ చదవండి: Facial: ఇంట్లోనే కాఫీ ఫేషియల్.. ఖర్చులేని కాంతివంతమైన స్కిన్..
ఇదీ చదవండి: Morning Vs Evening Walk: ఉదయం లేదా సాయంత్రం గుండె ఆరోగ్యానికి ఎప్పుడు వాకింగ్ చేయాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









