Eat Soaked Dry Fruits: ప్రతిరోజు మనం తీసుకునే ఫుడ్స్ లో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేలా చూసుకోవాలి. అయితే డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. ప్రతిరోజు డైట్‌లో చేర్చుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు. అయితే చాలామంది తెలియక డ్రై ఫ్రూట్స్ నేరుగా తింటారు. అయితే ఐదు రకాల డ్రైఫ్రూట్స్ మాత్రం నానబెట్టిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.
బాదం..
బాదంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది నానబెట్టి తీసుకోవాలి. దీన్ని తొక్క తీసి తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే అవుటర్ స్కిన్ లో టానీన్స్ ఉంటాయి. ఇది రాత్రంతా నానబెట్టి ఉదయం తొక్క తీసి తీసుకోవటం వల్ల జీర్ణ ఆరోగ్యం. బాదంలో మెదడు పనితీరు మెరుగు చేసే గుణాలు ఉంటాయి. అంతే కాదు ఎముకలకు కూడా బలం. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలో నిర్వహిస్తుంది. రోజు స్నాక్ రూపంలో కూడా తీసుకోవచ్చు. నానబెట్టి ఒక 8 బాదం ప్రతిరోజు తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
వాల్ నట్స్..
వాల్నట్స్ లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ , యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్స్ ఉంటాయి. వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవాలి. ఇందులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ప్రతిరోజు ఒక 4 వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. నొప్పుల సమస్యలను తగ్గిస్తాయి.
కిస్‌మిస్..
కిస్‌మిస్ లో సహజ చక్కెర, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు మంచి రెమెడీ. అంతే కాదు ఇది తీసుకోవటం వల్ల చక్కెర తినాలనే కోరిక తగ్గిపోతుంది. ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో అరగంట నానబెట్టి తీసుకుంటే మంచిది. నానబెట్టిన కిస్‌మిస్ తో బోలెడు ప్రయోజనాలు. నానబెట్టిన నీటిని తీసుకోవటం వల్ల కూడా మంచి ఆరోగ్య లాభాలు కలుగుతాయి. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి ఇవి తోడ్పడతాయి.
అంజీర్ పండ్లు..
అంజీర్ పండ్లలో కూడా కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ అంజీర్ పండ్లు లో ఖనిజాలు జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాల్షియం, ఐరన్, పొటాషియం ఉండటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గించి కడుపులో గ్యాస్ అజీర్తిని దూరం చేస్తుంది. దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు మంచి రెమెడీ అని చెప్పవచ్చు. ప్రతిరోజు ఒక 2 ఫిగ్స్ తీసుకోవడం మంచిది. అయితే రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవటం మేలు..
జీడిపప్పు..
జీడిపప్పులో కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ కలిగి ఉంటుంది. నానబెట్టి తీసుకోవడం వల్ల డబుల్ ప్రయోజనాలు. ప్రతి రోజూ ఒక రెండు మూడు గంటలు నానబెట్టిన జీడిపప్పు తీసుకుంటే మంచిది. పేస్ట్ చేసి తీసుకోవచ్చు. వంటల్లో తయారు చేసుకొని వేసుకోవడం వల్ల కార్డియో ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









