Foods for Acidity: ఎసిడిటీ తో బాధ పడుతున్నారా.. అయితే ఈ ఆహార పదార్థాలు తప్పనిసరి..

Acidity Tips: ఈ మధ్య కాలంలో.. బయట ఆహారం తినడం, సమయానికి తినకపోవడం.. ఇలాంటి ఎన్నో ఆహారపు అలవాట్ల కారణంగా.. అసిడిటీ వంటివి చాలా సులువుగా వస్తున్నాయి. కానీ అలాంటి సమయంలో.. కడుపు ఉబ్బరం తగ్గించడానికి సరైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 22, 2024, 11:00 PM IST
Foods for Acidity: ఎసిడిటీ తో బాధ పడుతున్నారా.. అయితే ఈ ఆహార పదార్థాలు తప్పనిసరి..

Acidity Foods: యాసిడ్ రిఫ్లక్స్‌ చాలా అసౌకర్యంగా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కొన్నిసార్లు అసిడిటీని పట్టించుకోకుండా.. ఆహారపు అలవాట్లు మార్చకపోతే గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి GERD కూడా.. వచ్చే అవకాశం ఉంటుంది. కడుపులోనుండి ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి ప్రవహించినప్పుడు ఈ సమస్య వస్తుంది. కానీ యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాల నుండి తక్షణమే ఉపశమనాన్ని కలిగించే కొన్ని ఆహారాలు, పానీయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

గ్రీన్ కూరగాయలు:

గ్రీన్ బీన్స్, బ్రోకలీ, ఆస్పరాగస్, కాలీఫ్లవర్, ఆకు కూరలు, బంగాళదుంపలు, దోసకాయలు వంటివి తక్కువ కొవ్వు,  తక్కువ చక్కెర కలిగి.. ఉంటాయి. కాబట్టి అవి తినడం వల్ల జీర్ణ ప్రక్రియలో వచ్చే ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. 

అల్లం:

అల్లంతో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండెల్లో మంట, కడుపు వ్యాధులకి చికిత్స చేస్తాయి. తురిమిన లేదా ముక్కలు.. చేసిన అల్లంతో అల్లం టీ తాగడం వల్ల కూడా యాసిడ్ రిఫ్లక్స్.. లక్షణాలు నియంత్రించవచ్చు.

పండ్లు: 

అరటిపండ్లు, పుచ్చకాయలు, నారింజ వంటి పండ్లలో ఇతర పండ్లతో పోలిస్తే ఆమ్లం తక్కువగా ఉంటుంది. కాబట్టి అసిడిటీ ఉన్నప్పుడు.. అలాంటివి తినడం వల్ల త్వరగా జీర్ణం అవ్వడం మాత్రమే.. కాక గ్యాస్ ఇబ్బందులు కూడా రావు. 

ఓట్ మీల్/ క్వినోవా:

ఓట్ మీల్, క్వినోవా, బార్లీ వంటి తృణధాన్యాలు కూడా కడుపులో ఆమ్లాలను గ్రహించి, యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తగ్గిస్తాయి.  

పెరుగు: 

పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి కడుపులోని ఆమ్లాన్ని తొలగించడానికి సహాయపడతాయి. అసిడిటీ నుండి తక్షణమే.. ఉపశమనం పొందడంలో కూడా అవి సహాయపడతాయి. 

మంచినీళ్లు:

కడుపు లో ఉన్న ఆమ్లాలను పలచన చేయడానికి మంచినీళ్లు బాగా సహాయపడతాయి. ప్రతిరోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు త్రాగడం మంచిది.

టీ: 

చమోమిల్, లావెండర్ లేదా అల్లం వంటి హెర్బల్ టీలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. 

ఒకవేళ ఎన్ని టిప్స్ ఫాలో అయినా కూడా యాసిడ్ రిఫ్లక్స్‌ తగ్గకపోయినా, క్రమేణా పెరుగుతూ వచ్చినా, లేదు నొప్పి ఎక్కువగా ఉన్న కూడా తక్షణమే వైద్యుడిని సంప్రదించడం మంచిది. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఈ రకం వ్యాధులను పరీక్షిస్తారు.  మన శరీరంలోని అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు తదితర ఇబ్బందులకు, వ్యాధులకు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ను సంప్రదించాలి.

Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో

Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News