High Bp Tips: ఇటీవలి కాలంలో లైఫ్‌స్టైల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. వీటిలో డయాబెటిస్, రక్తపోటు, కొలెస్ట్రాల్ ప్రధానమైనవి. ఎందుకంటే ఈ మూడు సమస్యలు శరీరంలో ఇతర వ్యాధులకు కారణమౌతుంటాయి. అందుకే ముందు ఈ సమస్యలకు చెక్ పెట్టాలి. రక్తపోటు సమస్య గుండె వ్యాధులకు కారణమౌతుంది. మరి ఈ సమస్యను ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం.
అధిక రక్తపోటు సమస్య ఎంత సామాన్యంగా కన్పిస్తుందో అంతే ప్రమాదకరం. దీని లక్షణాలు పెద్దగా కన్పించవు. సకాలంలో ఈ సమస్యకు చెక్ పెట్టకపోతే గుండె వ్యాధులు, హార్ట్ ఎటాక్, స్ట్రోక్‌కు దారితీస్తుంది. రక్తపోటును నియంత్రించాలంటే ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉండాలి. మందులు వాడినంత మాత్రాన ఇది నియంత్రణలో ఉండదు. కొన్ని సీడ్స్ క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా గుండె పదిలంగా ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు సమస్య దీర్ఘకాలం లేకుండా చూసుకోవాలి. లేకపోతే గుండె పోటు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధులు, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురౌతాయి.
ఈ పరిస్థితుల్లో ఫ్లక్స్ సీడ్స్ రక్తపోటును నియంత్రించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల రక్త నాళాలు పటిష్టంగా ఉండి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్త నాళాలు సంకోచించకుండా ఉంటాయి. దాంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ దూరమౌతుంది. మరో అద్భుతమైన సీడ్స్ చియా సీడ్స్. ఇందులో కూడా పోషకాలకు కొదవ లేదు. అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెడుతుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్త నాళాల్ని రిలాక్స్ చేస్తాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో సోడియంను నియంత్రిస్తాయి. ఈ రెండు రకాల సీడ్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు గుండెను పదిలంగా ఉంచుతాయి.
ఫ్లక్స్, చియా సీడ్స్‌ను రోస్ట్ చేసి తినవచ్చు లేదా నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు. కొంతమంది స్మూదీ చేసుకుని సేవిస్తారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యపరంగా అద్భుతమైన లాభాలు కలిగి ఉంటాయి. ఏ రూపంలో తీసుకున్నా ఫరవాలేదు. చియా సీడ్స్ మజ్జిగలో నానబెట్టి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
Also read: Post Office Insurance: 520 రూపాయల ప్రీమియంతో 15 లక్షల బీమా, ఎక్కడ, ఎవరు అర్హులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









