
Stomach Cleanse Drink In Summer: ఎండాకాలం కడుపు సమస్యలు వేధిస్తాయి. ఈ నేపథ్యంలో జీర్ణ సమస్యలు కూడా వెంటాడతాయి. మెటబాలిజం రేటు కూడా పెంచుకోవడానికి కొన్ని రకాల జ్యూసులు తీసుకోవాలి. ఇవి తక్షణ శక్తిని అందించడమే కాకుండా పేగులను శుభ్రం చేసి కడుపు ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇవి మెటబాలిజం రేటును పెంచుతాయి. సహజ సిద్ధంగా పేగులను క్లీన్ చేసే కొన్ని రకాల జ్యూస్‌లు మన శరీరం నుంచి విష పదార్థాలను బయటికి పంపించేస్తాయి.
నిమ్మ, అల్లం నీరు..
ఈ రెండిటిని కలిపి తీసుకోవటం వల్ల పేగుల్లో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. దీంతో కడుపు సహజసిద్ధంగా క్లెన్స్ అయిపోతుంది. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ఇక నిమ్మకాయలు ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డిటాక్సీఫై చేస్తాయి. ఆరోగ్యకరమైన జీవక్రియకు కూడా తోడ్పడతాయి. అంతేకాదు మన కాలేయ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అల్లం తీసుకోవడం వల్ల ఇవి సహజ సిద్ధమైన నయం చేసే గుణాలు కలిగి ఉంటుంది. కడుపులో గ్యాస్, అజీర్తికి చెక్ పెడుతుంది. ప్రధానంగా జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ ..
యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల కడుపు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కడుపు పీహెచ్ యాసిడ్ లెవెల్స్ సమతులంగా ఉంచుతుంది. అంతేకాదు జీర్ణ క్రియను మెరుగు చేస్తుంది. కడుపులో గ్యాస్ కి చెక్ పెడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యకరమైన బ్యాక్టిరయా కడుపులో పెరగడానికి సహాయపడుతుంది. మన శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేసే గుణం ఇది కలిగి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటికి వెళ్తాయి.
కీరదోస ..
కీరదోస ఎండాకాలం మంచి హైడ్రేషన్ అందిస్తుంది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇందులో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటికి పోతాయి. కీరదోసలో ఫైబర్ కడుపు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఎండాకాలం డైట్లో చేర్చుకోవడం వల్ల మంచి ఎలక్ట్రోలైట్‌లా పని చేస్తాయి కడుపు క్లీన్ అయిపోతుంది. డిహైడ్రేషన్ గురి కాకుండా ఉంటారు.
పుదీనా జ్యూస్..
తాజా పుదినాకులతో తయారుచేసిన డ్రింక్ తీసుకోవడం వల్ల కడుపు శుభ్రమైపోతుంది. అంతేకాదు డైజెస్ట్ ఎంజామ్లా ఉత్పత్తికి తోడ్పడతాయి. కడుపులో గ్యాస్, అజీర్తికి చెక్ పెడుతుంది. పుదీనా మెటబాలిజం రేటును పెంచుతుంది. పుదీనాలో చల్లని గుణాలు కలిగి ఉంటాయి. ఎండాకాలం తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.
పేగు ఆరోగ్యానికి డ్రింక్ వీటన్నిటితో కలిపి తయారుచేసుకోవచ్చు. దీనికి అరచెక్క నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, కీరదోస ముక్కలు, ఒక గుప్పెడు పుదీనా ఆకులు ఒక గ్లాసు నీటిని తీసుకోవాలి. అల్లం సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అన్నిటిని ఒక దాంట్లో వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఒకవేళ మీరు నేరుగా తీసుకోలేకపోతే వాటిని బ్లెండ్ చేసి తీసుకోవచ్చు. ఉదయం పరగడుపున ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మీ కడుపు సమస్యలు తొలగిపోయి, మెటబాలిజం రేటు పెరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe