Amazing Health Benefits Of Betel Leaves: తమలపాకు (Betel Leaf) ఒక రకమైన తీగ జాతి మొక్క. ఇది ఆగ్నేయాసియా, దక్షిణ ఆసియా ప్రాంతాలలో విస్తృతంగా పెరుగుతుంది. దీని ఆకులను సాంప్రదాయకంగా నమిలేందుకు ఉపయోగిస్తారు. తమలపాకును వక్క, సున్నం కలిపి నమలడం భారతదేశంలో ఒక సాంప్రదాయం. దీనిని తాంబూలం అని కూడా అంటారు.
తమలపాకు అనేక ఆరోగ్య ప్రయోజనాల:
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: తమలపాకు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి, తమలపాకులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగితే పేగు ఆరోగ్యానికి మంచిది.
నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: తమలపాకు నమలడం వలన నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇది నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది.
శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది: తమలపాకు ఊపిరితిత్తులు , ఛాతీలో ఇబ్బంది, ఉబ్బసం లక్షణాలను ఉపశమనానికి , నయం చేయడానికి ఉపయోగిస్తారు. తమలపాకుకు ఆవాల నూనె రాసి ఛాతీపై ఉంచి కొద్దిసేపు అలాగే ఉంచితే చాతీలో ఇబ్బంది తగ్గుతుంది.
చర్మ సమస్యలను తగ్గిస్తుంది: తమలపాకు పేస్ట్‌ను చూర్ణం రాస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి తక్షణ ఉపశమనం కలిగుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: తమలపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది: షుగర్ పేషెంట్లు కూడా తమల పాకును తీసుకోవడం వల్ల డయాబెటీస్‌ను కంట్రోలో చేయవచ్చు.
క్యాన్సర్ నిరోధక లక్షణాలు: కొన్ని అధ్యయనాల ప్రకారం, తమలపాకులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి.
ఇంకా, తమలపాకును కడుపులోపలకు తీసుకుంటుంటే ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ (అంగ స్తంభన ) ఇబ్బంది పెట్టదు. తమలపాకు షర్బత్‌ని తీసుకుంటే బలహీనత దూరమవుతుంది. తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.
తమలపాకును అందరూ తినకూడదు. కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు తమలపాకు తినడం మానుకోవాలి. ఎందుకంటే తమలపాకు కొన్ని ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేస్తుంది. ఎవరెవరు తమలపాకు తినకూడదో ఇక్కడ ఉంది:
గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు: గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు తమలపాకును తినకూడదు. ఇది వారికి, వారి పిల్లలకు హాని కలిగించవచ్చు.
గుండె జబ్బులు ఉన్నవారు: తమలపాకు గుండె వేగాన్ని పెంచుతుంది. ఇది గుండె జబ్బులు ఉన్నవారికి ప్రమాదకరం.
అధిక రక్తపోటు ఉన్నవారు: తమలపాకు రక్తపోటును పెంచుతుంది. ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుంది.
కడుపులో పుండ్లు ఉన్నవారు: తమలపాకు కడుపులో మంటను కలిగిస్తుంది. ఇది కడుపులో పుండ్లు ఉన్నవారికి బాధను పెంచుతుంది.
నోటి పూత లేదా నోటిలో ఏదైనా సమస్యలు ఉన్నవారు: తమలపాకు నోటి పూతను లేదా నోటిలో ఏవైనా సమస్యలను పెంచుతుంది.
గమనిక: తమలపాకును మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అయితే దీనిని ఎక్కువగా నమలడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









