Bloating: నిమిషాల్లో అజీర్తిని తగ్గించే నీళ్లు.. పొట్టలోకి వెళ్లగానే అంతా అరిగిపోతుంది..

Bloating Relief Tips: కడుపులో గ్యాస్, అజీర్తి ఉన్నప్పుడు ఏ పని చేయాలని పరిస్థితి ఏర్పడుతుంది. వీటిని తగ్గించుకోవడానికి కొన్ని డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అల్లం, పెప్పరమెంట్‌, పసుపు, జీలకర్ర వీటితో నీళ్లు తయారు చేసుకొని తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్ రెమిడిగా పని చేస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Mar 2, 2025, 12:00 PM IST
Bloating: నిమిషాల్లో అజీర్తిని తగ్గించే నీళ్లు.. పొట్టలోకి వెళ్లగానే అంతా అరిగిపోతుంది..

Bloating Relief Tips: ప్రస్తుత కాలంలో బ్యాడ్ లైఫ్ స్టైల్ కారణంగా కడుపులో గ్యాస్, అజీర్తి ఏర్పడుతుంది. దీంతో ఆకలి వేయదు.. కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు మసాలా ఫుడ్స్ తీసుకోవడం,జీర్ణశక్తి సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని ఇంటి చిట్కాలతో ఈ గ్యాస్ , అజీర్తి సమస్యను తగ్గించుకోవచ్చు.

Add Zee News as a Preferred Source

అల్లం టీ..
అల్లం ఎన్నో ఏళ్లుగా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఆయుర్వేద పరంగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. అల్లంలో జింజోరేల్‌ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. కడుపులో గ్యాస్, అజీర్తిని తక్షణమే తగ్గిస్తుంది.. అంతేకాదు అల్లం తీసుకోవడం వల్ల కడుపు కండరాలు కూడా ఉపశమనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అల్లం తో టీ తయారు చేసుకొని తీసుకోవాలి. ఈ నీటిని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నీటిలో వేడి చేసి టీ తీసుకోవడం వల్ల కడుపునొప్పి ఉపశమనం కూడా వెంటనే తగ్గిపోతుంది.

పుదీనా టీ..
పుదీనాతో టీ తయారు చేసుకొని తీసుకోవడం వల్ల కడుపు కూడా గ్యాస్ తగ్గిపోతుంది. ఇది కడుపు కండరాలకు మంచి ఉపశమనం కలిగిస్తాయి. కడుపులో అజీర్తి ఉంటే వెంటనే అరిగిపోతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగు చేస్తుంది. గుప్పెడు పుదీనాలను నీళ్లలో వేసి ఉడికించి తీసుకోవాలి. ఈ నీరు మంచి రిఫ్రెష్మెంట్ కూడా అందిస్తుంది. కడుపు నిండిన అనుభూతిని తగ్గిస్తుంది.

టర్మరిక్ లట్టే...
పసుపుతో తయారు చేసుకునే ఈ నీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. దీంతో కడుపులో ఉబ్బసం, గ్యాస్ తగ్గిపోతుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. పసుపులో ఇన్లమేషన్ తగ్గించే గుణాలు ఉంటాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీంతో కడుపులో ఉన్న అజీర్తి, గ్యాస్ తగ్గిపోతుంది. అజీర్తి తగ్గించే గుణం కలిగి ఉంటుంది. పసుపును నీళ్లలో కలిపి తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. అయితే కడుపులో గ్యాస్ ఉన్నప్పుడు పసుపు పాలలో కలిపి తీసుకోకపోవడం మేలు

పసుపు మిరియాల పొడి కలిపి కూడా తీసుకోవటం వల్ల ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కావాలంటే ఇందులో కాస్త తేనె, దాల్చిన చెక్క పొడి కూడా కలిపి తీసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు ఈ టర్మరిక్ లట్టే తయారు చేసుకొని తీసుకోవాలి. రాత్రికి రాత్రే కడుపులో అజీర్తి సమస్య తగ్గిపోతుంది.

చింతపండు ఇలా తీసుకుంటే ఈ వ్యాధులు జన్మలో రావు.. నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు..!

జీరా వాటర్..
జీలకర్ర మనం వంటల్లో వినియోగిస్తాం. జీర్ణ వ్యవస్థను మెరుగు చేసే గుణం జీలకర్రలో ఉంది. జీలకర్రతో తయారు చేసిన నీటిని తీసుకోవడం వల్ల కూడా కడుపులో అజీర్తీ తక్షణమే తగ్గిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను, రెండు కప్పుల నీళ్లలో వేసి పది నిమిషాల పాటు ఉడికించి వడకట్టుకొని గోరువెచ్చగా తీసుకోవాలి. ఇందులో కావాలంటే కాస్త ఉప్పు లేదా నిమ్మరసం వేసుకొని తీసుకోవచ్చు.

సోంపు నీటిని తీసుకోవడం వల్ల కూడా కడుపులో అజీర్తి సమస్య తగ్గిపోతుంది.  ఇందులో డైరుటిక్‌ గుణాలు ఉంటాయి. వీటిని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల తక్షణమే కడుపు అజీర్తి, గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. ప్రతిరోజు తిన్న తర్వాత కాస్త సోంపు గింజలు నోట్లో వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల త్వరగా జీర్ణం అయిపోతుంది.

ఇదీ చదవండి:  అమ్మ బాబోయ్.. BSNL ఏడాది ప్లాన్ మరీ ఇంత తక్కువ.. ధర తెలిస్తే ఎగిరి గంతేస్తారు బ్రో..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News