)
Blueberry Benefits: బ్లూ బెర్రీ పండ్లు బ్లెండ్ చేసి స్మూథీ రూపంలో కూడా తింటారు. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. పోషకాలకు పవర్ హౌస్ అయిన బ్లూబెర్రీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కొన్ని నివేదికల ప్రకారం ఈ పండ్లు తీసుకుంటే ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది.
బ్రెయిన్ బుస్టింగ్ పవర్..
బ్లూ బెర్రీలు రెగ్యులర్‌గా తీసుకుంటే మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు నొప్పి, మంట సమస్యలను తగ్గిస్తాయి. ఆక్సిడేటివ్స్ నుంచి కాపాడుతాయి. బ్లూ బెర్రీలు మెమరీ పవర్ పెంచుతుంది. ఇది కొన్ని నివేదికల ప్రకారం ఈ పండ్లు తీసుకోవడం వల్ల మెదడు అభిజ్ఞా పనితీరు మెరుగయింది.
గుండె ఆరోగ్యం
బ్లూ బెర్రీ తింటే గుండె ఆరోగ్యం గా ఉంటుంది. ఈ చిన్న పండ్లు రక్త సరఫరాను మెరుగు చేస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా అవుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే బ్లూబెర్రీలు తీసుకుంటే ఆర్టెరీ బ్లాక్ కూడా కాదు. ఇందులో విటమిన్స్ ఉంటాయి.
నొప్పి సమస్యతో బాధపడుతున్న వాళ్లు కూడా ఈ బ్లూబెర్రీలు తినాలి. ఇది చిన్న చిన్న నొప్పులను తగ్గిస్తుంది. దీంతో తక్షణ శక్తి కూడా అందుతుంది. స్నాక్ రూపంలో బ్లూ బెర్రీలను తీసుకోవడం వల్ల శరీరం నొప్పుల నుంచి కూడా బయటపడతారు.
పేగు ఆరోగ్యం..
బ్లూ బెర్రీ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కడుపునిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కల్పిస్తుంది. తద్వారా అతిగా తినకుండా ఉంటారు. ఇది కడుపులో మంచి బ్యాక్టిరియా పెరిగేలా చేస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపులో గ్యాస్, అజీర్తితో బాధపడుతున్న వాళ్లకు ఇది బెస్ట్ రెమెడీ.
రెగ్యులర్‌గా బ్లూబెర్రీలు తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సూర్యుని హానికర కిరణాల నుంచి కాపాడుతుంది. కాలుష్యం నుంచి ఇది రక్షణ అందిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి ఈ పండ్లు తోడ్పడుతాయి.
ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఖనిజాల పుష్కలంగా ఉండటం వల్ల సీజనల్ జబ్బులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. త్వరగా నయమయ్యేలా చేస్తుంది. బరువు నిర్వహణలో ఉన్న వాళ్ళు కూడా బ్లూబెర్రీలు తినాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి