Coronavirus through mosquitoes: దోమ కాటుతో కరోనావైరస్ వ్యాపిస్తుందా ?
COVID-19 through mosquitoes: న్యూయార్క్ : కరోనావైరస్ దోమ కాటుతో వ్యాపిస్తుందా ? కరోనా సోకిన వారిని కరిచిన దోమ మరొకరిని కరిస్తే.. వారికి కూడా కరోనావైరస్ ( Coronavirus ) సోకుతుందా అనే సందేహాలు యావత్ ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో ఈ అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది.
COVID-19 through mosquitoes: న్యూయార్క్ : కరోనావైరస్ దోమ కాటుతో వ్యాపిస్తుందా ? కరోనా సోకిన వారిని కరిచిన దోమ మరొకరిని కరిస్తే.. వారికి కూడా కరోనావైరస్ ( Coronavirus ) సోకుతుందా అనే సందేహాలు యావత్ ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో ఈ అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. ఈ ప్రశ్నలన్నింటిపై ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) స్పష్టమైన వివరణ ఇచ్చింది. దోమ కాటు కారణంగా కరోనావైరస్ వ్యాపిస్తుందనడానికి ఇప్పటివరకు సరైన ఆధారాలు ఏవీ లభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది. తాజాగా జరిగిన ఓ అధ్యయనంలోనూ అదే నిజమని తేలింది. ( Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )
కొవిడ్-19 వ్యాధికి కారణమయ్యే SARS-CoV-2 వైరస్ వ్యాప్తిపై జరిగిన అధ్యయనానికి సంబంధించిన ఫలితాలను సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ( Journal Scientific Report ) ప్రచురించారు. దోమల కారణంగా కరోనావైరస్ వ్యాపించదని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిచెప్పినప్పటికీ.. అందుకు తగిన ఆధారాలు మాత్రం తమ అధ్యయనంలోనే వెల్లడయ్యాయని అమెరికాలోని కన్సాస్ యూనివర్శిటీకి ( Kansas university ) చెందిన పరిశోధకుడు స్టీఫెన్ హిగ్స్ స్పష్టంచేశారు. ( Fruits and vitamins: ఈ పండ్లు తింటే ఇన్‌ఫెక్షన్, వైరస్‌లకు చెక్ పెట్టొచ్చు)