)
Cauliflower or broccoli Suits Indians: కాలీఫ్లవర్, బ్రోకోలీ ఈ రెండూ చూడటానికి ఒకేవిధంగా ఉంటాయి. కానీ, రంగు మాత్రమే వేర్వేరుగా ఉంటాయి. కాలీఫ్లవర్ తెలుపు రంగులో ఉంటే.. బ్రోకోలీ ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాలీఫ్లవర్, బ్రోకోలీ ఈ రెండిటిలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మరిన్ని పోషకాలు ఉంటాయి. అయితే, మన భారతీయులకు రెండిటిలో ఏది తింటే మంచిది తెలుసుకుందాం.
సాధారణంగా కాలీఫ్లవర్‌తో గోబీ ఫ్రై, పరోటా, గోబీ ఫ్రై తయారు చేసుకుంటాం. ఇది రుచికరంగా ఉంటాయి. బ్రోకోలీతో కూడా కూర తయారు చేసుకోవచ్చు. దీన్ని మన దేశం కంటే ఇతర దేశంలో ఎక్కువగా సలాడ్, సూప్ రూపంలో తీసుకుంటారు.
ఖనిజాల గని..
బ్రోకోలీలో కాలీఫ్లవర్ కంటే విటమిన్ సీ, కే, ఏ పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు బ్రోకలీ తింటే మీకు ఒక రోజుకు సరిపోయే విటమిన్ సీ వంద శాతం లభిస్తుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. కాలీఫ్లవర్‌లో క్యాలరీలు కూడా కూడా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండూ బెస్ట్ ఆప్షన్.
కేన్సర్‌కు వ్యతిరేకం..
బ్రోకోలీలో సల్ఫోరఫేస్ ఉంటుంది. ఇది మంట సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు కేన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బ్రోకోలీ, కాలీఫ్లవర్ రెండూ లివర్ డిటాక్సిఫికేషన్‌కు సహాయపడుతుంది. అయితే, కాలీఫ్లవర్‌లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కానీ, బ్రోకోలీతో పోలిస్తే తక్కువే ఉంటాయి.
జీర్ణ ఆరోగ్యం..
బ్రోకోలీ, కాలీఫ్లవర్ రెండూ జీర్ణ ఆరోగ్యానికి సహాయపడుతాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. అంతేకాదు ఈ క్రూసీఫెరస్ జాతికి చెందిన కూరగాయలతో దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు మంచి రెమడీ. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినే భారతీయులు బ్రోకోలీ తింటే కడుపు ఆరోగ్యం బాగుంటుంది.
డయాబెటీస్ నిర్వహణ..
బ్రోకోలీలో గ్లైసెమిక్ సూచీ తక్కువగా ఉంటుంది. ఇది ఇన్సూలీన్ నిరోధకతను మెరుగు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.కాలీ ఫ్లవర్ డయాబెటీస్ ఫ్రెండ్లీ కానీ, ఇందులో సల్ఫోరఫేన్ ఉండదు. అయితే, డయాబెటీస్ వారికి బ్రోకోలీ తింటే మంచిది.
గుండె ఆరోగ్యం..
ఈ రెండూ కూరగాయలు కూడా కార్డియో ఆరోగ్యానికి సహాయపడతాయి. కానీ, బ్రోకోలీలో పొటాషియం, ఫోలెట్ ఎక్కువగా ఉంటాయి. ఇది బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించి గుండె పనితీరును మెరుగు చేస్తుంది. మన దేశంలో గుండె ప్రమాదాలు ఎక్కువ ఉన్న తరుణంలో బ్రోకోలీ తింటే నయం.
అయితే, కాలీఫ్లవర్ మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. దీని ధర కూడా సాధారణంగానే ఉంటుంది. కానీ, బ్రోకోలీ రేటు ఎక్కువ. అంతేకాదు ఇది అన్నీ మార్కెట్లలో.. సీజన్లలో అందుబాటులో ఉండదు. కాలీఫ్లవర్ మన ఇండియన్ వంటగదుల్లో కచ్చితంగా వండుకుంటారు. కానీ, బ్రోకోలీ అప్పుడప్పుడూ వండుకుంటారు. బ్రోకోలీతో ఫ్రై, సూప్ తయారు చేసుకుంటే బాగుంటుంది. బ్రోకోలీ, కాలీఫ్లవర్ రెండూ ఆరోగ్యకరం. ఈ రెండిటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటీస్ వారికి మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook