Cholesterol Remedies: మనం తీసుకునే చెడు ఆహారపు అలవాట్ల కారణంగా రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటుంది. ఒక్క కొలెస్ట్రాల్ శరీరంలో వివిధ వ్యాధులకు కారణమౌతుంది. ఇటీవలి కాలంలో చిన్నారులు కూడా కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారు. అందుకే తినే ఆహారం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అసలు కొలెస్ట్రాల్ సమస్య ఉంటే నాన్ వెజ్ తినవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొలెస్ట్రాల్ సమస్య సాధారణంగా శాకాహారుల కంటే మాంసాహారుల్లో ఎక్కువగా కన్పిస్తుంది. మాంసాహారంలో చికెన్ వర్సెస్ మటన్‌లో ఏది తినవచ్చనేది మరో సందేహం నెలకొంది. చికెన్ కంటే మటన్ కాస్త ప్రమాదకరం. అందుకే కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవాళ్లు మటన్‌కు దూరంగా ఉండటం మంచిది. మాంసాహారం తినేకంటే చికెన్ లేదా చిన్న చేపలు తినడం చాలా ఉత్తమం. చికెన్ కూడా కూర రూపంలో తీసుకోవడం మంచిది. ఫ్రై చికెన్ మళ్లీ ప్రమాదకరమే. చికెన్ అనగానే చాలామంది చికెన్ ఫ్రై, కడాయ్ చికెన్, బటర్ చికెన్, డీప్ ఫ్రై చికెన్ వంటివి ఇష్టపడుతుంటారు. కానీ ఇవి ఏ మాత్రం మంచివి కావు. సాధ్యమైనంత వరకూ చికెన్‌ను తక్కువ నూనెలో వండి తినాలి. 


ఏదైనా సరే కొలెస్ట్రాల్ సమస్య ఉంటే మాంసాహారం పూర్తిగా మానేయడమే మంచిది. ముఖ్యంగా రెడ్ మీట్‌కు దూరంగా ఉండాలి. బర్డ్ మీట్ తినొచ్చు గానీ తక్కువ నూనెలో వండుకోవాలి. అదే సమయంలో కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. 


Also read: Cloves Benefits: రోజూ 2 లవంగాలు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.