Cinnamon Water: ఈ నీటిలో 5 ఔషధ గుణాలు ఉంటాయి.. ఆ వ్యాధులను మటాష్ చేస్తుంది..

Cinnamon Water Health Benefits: ఆయుర్వేద పరంగా దాల్చిన చెక్కలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఎన్నో ఔషధ పరంగా ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క ఒక మసాలా. ఇది మంచి ఆరోమా అందిస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Mar 20, 2025, 04:49 PM IST
Cinnamon Water: ఈ నీటిలో 5 ఔషధ గుణాలు ఉంటాయి.. ఆ వ్యాధులను మటాష్ చేస్తుంది..

Cinnamon Water Health Benefits:  దాల్చినచెక్క నీరు రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకుంటే ఇందులో ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది  నీటిలో కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఐదు ప్రయోజనాలు తెలుసుకుందాం.. 

Add Zee News as a Preferred Source

వెయిట్ లాస్..
దాల్చిన చెక్క నీటిని తీసుకోవటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి మేలు జరుగుతుంది. ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్న వాళ్ళు ఈ నీటిని తీసుకోవాలి. అతిగా తినకుండా ఉంటారు. ఇది మన శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించేస్తుంది, బరువు నిర్వహిస్తుంది.

జీర్ణ ఆరోగ్యం ..
దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం వల్ల మంచి జీర్ణ ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. ఇందులో డైజెస్టివ్ ఎంజైమ్స్‌ ఉత్పత్తికి ప్రేరేపించే గుణాలు కలిగి ఉంటాయి. కడుపులో గ్యాస్ అజీర్తికి చెక్ పెడుతుంది. దాల్చిన చెక్క నీటిని తీసుకోవటం వల్ల జీర్ణ సమస్యల త్వరగా తగ్గిపోతాయి. రోజంతటికి కావలసిన శక్తి కూడా అందుతుంది.

 షుగర్ నియంత్రణ..
దాల్చిన చెక్కను నేచురల్‌ ఇన్సులిన్ అంటారు. రాత్రి దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి పెట్టి ఉదయం ఆ నీటిని పరగడుపున తీసుకోవడం వల్ల రోజంతా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగవు.

 దాల్చిన చెక్కన నీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ నుంచి కాపాడుతుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఈ నీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే సీజనల్ వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచే గుణాలు కలిగి ఉంటుంది.

దాల్చిన చెక్క కొన్ని రకాల నొప్పులు మంట సమస్యలను కూడా తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు ఆర్థరైటిస్ కూడా మంచి రెమిడీ అని చెప్పొచ్చు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. దాల్చిన చెక్క నీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉంచతుంది. 

 గుండె ఆరోగ్యానికి దాల్చిన చెక్క నీటిని తీసుకోవాలి. ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కొలెస్ట్రాల్ ని తగ్గించేసి బీపీని అదుపులో ఉంచుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మీ రెగ్యులర్ డైట్ లో దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం వల్ల కార్డియో ఆరోగ్యం కూడా బాగుంటుంది. దాల్చిన చెక్కను పొడి చేసి రాత్రి ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఈ నీటిని తీసుకోవడం వల్ల నేచురల్ ఇన్సూలిన్‌లా పనిచేస్తుంది. ఈ నీటిలో ఔషధ గుణాలు పుష్కలం.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News