Copper: ఎండాకాలం రాగి పాత్రలో నీళ్లు, ఆహారం తీసుకోకూడదా? ఏం జరుగుతుంది?

Copper Side Effects In Summer: సాధారణంగా స్టీలు, అల్యూమీనియం పాత్రల కంటే కూడా రాగి పాత్రలు ఉపయోగించి వంట చేసుకుంటే మంచిది అంటారు. ఆరోగ్యానికి మేలు చేస్తుంది అంటారు. అయితే, ఎండాకాలం రాగి పాత్రలు ఉపయోగించకూడదా?

Written by - Renuka Godugu | Last Updated : Mar 22, 2025, 02:02 PM IST
Copper: ఎండాకాలం రాగి పాత్రలో నీళ్లు, ఆహారం తీసుకోకూడదా? ఏం జరుగుతుంది?

Copper Side Effects In Summer:  రాగి పాత్రలో ఉండే నీటిని తాగడం వల్ల శరీర ఆరోగ్యానికి తోడ్పడతాయి. విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి అంటారు. అందుకే రాగి పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి వంట గదిలో రాగి పాత్రలో నీరు పెట్టుకుంటారు. ఆ నీటిని తీసుకుంటారు. అయితే ఎండాకాలం రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు అంటున్నారు నిపుణులు ఎందుకో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

రాగి పాత్రలొ ఆహారం, నీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మనం ఎన్నో ఏళ్లుగా నమ్ముతాం. భారతీయ వంట గదిలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. రాగి పాత్రలో నీటిని రాత్రంతా పోసి ఉదయం ఆ నీటిని తాగటం వల్ల జీర్ణ ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే చాలామంది ఇళ్లలో ఈ రాగి పాత్రలు చూసే ఉంటాం. రాగి నీటి బాటిళ్లు కూడా విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎండాకాలం ఈ రాగి పాత్రలోని నీరు, ఆహారం ఉపయోగించడం వల్ల కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

ఎండాకాలం రాగి పాత్రలో వండటం లేదా నీటిని నిల్వ చేసుకోవడం వంటివి చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. ప్రధానంగా రాగిలో కెమికల్ గుణాలు కలిగి ఉంటాయి. వేడి చేసినప్పుడు కెమికల్‌ రియాక్షన్ అవుతుంది. దీంతో అది ఆహారంలో చేరిపోతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు మొదలవుతాయి. అంతేకాదు తల తిరుగుడు , వికారం వంటి సమస్యలు కూడా వస్తాయి. 

ఇదీ చదవండి: Stomach Cleanse Drink: ఎండాకాలం పేగులను శుభ్రం చేసే డ్రింక్‌.. కడుపు సమస్యలకు చెక్‌..

రాగి పాత్రలో ప్రధానంగా పాలు, పాల పదార్థాలు ఎండాకాలంలో నిల్వ చేయకూడదు. ఆ పదార్థాలను తీసుకోవటం వల్ల యాసిడిక్ రియాక్షన్ అవుతుంది. తద్వారా కడుపులో అజీర్తి, గ్యాస్‌కు దారితీస్తుంది. ప్రధానంగా మజ్జిగ వంటివి రాగి పాత్రలో వేసుకొని తీసుకోకూడదు. అంతేకాదు కొన్ని పుల్లటి ఆహారాలు కూడా రాగి పాత్రలో వేసుకొని తీసుకుంటే కడుపు సమస్యలు, డయేరియాకి కూడా దారి తీస్తుంది.

ప్రధానంగా పిల్లల ఆరోగ్యం పై ఇది ప్రభావం పడుతుంది. ఎండాకాలం  పిల్లలకు రాగి పాత్రలో ఆహారం, నీళ్లు ఇవ్వకపోవడమే బెట్టర్. ఎండాకాలం కాపర్ రియాక్షన్ జరుగుతుంది. కాబట్టి వాళ్లలో నీరస వంటి సమస్యలు వస్తాయి. సాధారణ సమయంలో రాగి పాత్రలో తీసుకోవడం ఆహారం తీసుకోవడం వల్ల అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఎండాకాలం ఆ పాత్రలకు దూరంగా ఉండటమే మంచిది . అంతేకాదు ఏ ఫుడ్ అయినా ఎండాకాలం నిలువ చేసుకోవాలంటే గ్లాసు లేదా స్టెయిన్‌లెస్‌ స్టీలు వంటి పాత్రలో మాత్రమే నిల్వ చేసుకోండి. అవి  రియాక్షన్ చెందని మెటీరియల్స్. ఇవి మన ఇళ్లలో ఎక్కువగానే అందుబాటులో ఉంటాయి.

ఇదీ చదవండి: తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్లు నేడు విడుదల.. శ్రీవాణి టోకెన్లు కూడా..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News