Coriander Water: ధనియాల నీళ్లు పొరపాటున కూడా ఈ నలుగురు తాగకూడదు..

Coriander Water Side Effects: ధనియాల నీరు ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో లాభాలు కలిగి ఉంటుంది. ధనియాలు మన శరీరానికి మంచి డిటాక్స్‌ డ్రింక్‌లా పనిచేస్తుంది. అయితే, ఈ ధనియాల నీరు కొంతమంది తీసుకోకూడదు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : May 2, 2025, 04:17 PM IST
Coriander Water: ధనియాల నీళ్లు పొరపాటున కూడా ఈ నలుగురు తాగకూడదు..

Coriander Water Side Effects: ధనియాల నీరు కొంతమంది పొరపాటున కూడా తీసుకోకూడదు. ఇది వారికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ చూపిస్తాయి. ధనియాల నీటిలో ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటుంది. కానీ, కొంతమంది మాత్రం వీటిని తీసుకోకూడదు. వారు ఎవరు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

బ్లడ్‌ ప్రెజర్‌..
ధనియాలు సహజంగా రక్తపోటును తగ్గిస్తుంది. అయితే, ఇప్పటికే లో బీపీ ఉన్నవారు పొరపాటున తీసుకోకూడదు. ఈ నీరు తాగడం వల్ల బీపీ మరింత తగ్గిపోతుంది. ఇలా ధనియాల నీటిని లో బీపీ ఉన్నవాళ్లు తీసుకుంటే మరింత నీరసానికి కూడా గురవుతారు. దీంతో వారికి కళ్లు తిరగడం వంటివి కూడా జరుగుతాయి.

అలర్జీ..
కొంతమందికి అలర్జీ సమస్యలు ఉంటాయి. వారు పొరపాటున కూడా ధనియాల నీరు తీసుకోకూడదు. ఇది మరింత దురదలు, వాపు సమస్యను తీవ్రతరం చేస్తుంది. మీ చర్మం పై స్కిన్‌ అలెర్జీ కూడా వస్తుంది. అప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించండి. దీనివల్ల అలెర్జీ తగ్గిపోతుంది.

ప్రెగ్నెన్సీ..
అంతేకాదు ఈ ధనియాల నీటిని కూడా ప్రెగ్నెన్సీ సమయంలో పొరపాటున తాగకూడదు. ధనియాలలో ఉండే అంశాలు యూట్రెస్‌ను ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రెగ్నెన్సీ ఉన్నవారు ధనియాల నీటిని తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీ మొదటి దశలో ధనియాల నీటిని తీసుకోకూడదు.

కిడ్నీ సమస్యలు..
కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ధనియాల నీరు తీసుకోకడదు. ఇది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు తీసుకోకూడదు. కిడ్నీ డ్యామేజ్‌ అయినవారు తీసుకుంటే వారి కిడ్నీలు మరింత ప్రభావం చెందే అవకాశం ఉంది.

డయాబెటీస్‌..
డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు కూడా పొరపాటున కూడా తాగకూడదు. ఇందులో మెడిసినల్‌ గుణాలు ఉంటాయి. ఇప్పటికే డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు మందులు తీసుకుంటారు. వీరు ధనియాల నీరు తీసుకోవడం వల్ల చక్కర స్థాయిలు హఠాత్తుగా తగ్గిపోతాయి. అందుకే మందులు తీసుకున్నప్పుడు ధనియాల నీరు తీసుకోవద్దు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

READ ALSO: ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల మీ తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా మారుతుంది..

READ ALSO: ఉసిరి లేదా గ్రీన్‌ టీ.. రెండిటిలో ఎందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News