Cucumber For Health: ఎండలకు అలసిపోయిన కళ్లకు ఉపశమనం కలిగించడంలో కీర ఎంతో దోహదం చేస్తుంది. కళ్ల కింది నల్లటి వలయాలను తొలగించడంలో కీరదోస పనిచేస్తుంది. ఎండాకాలంలో కీరదోస ముక్కల్ని కళ్లపై కాసేపు ఉంచుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కీరదోస కళ్లను అలసట నుంచి దూరం చేస్తాయి. దోసకాయలో లభించే విటమిన్ కే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కీరదోసలోని విటమిన్ సీ, విటమిన్ ఈ చర్మాన్ని కాంతిమంతంగా చేస్తాయి.
Also Read: Summer Skin Care: వేసవిలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలా? అయితే నీటిలో ఇవి కలపండి!
కీరదోసలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచే లక్షణం ఉండడంతో ముడతలను రాకుండా చేస్తుంది. వృద్ధాప్య లక్షణాలను దూరం చేయడంతో యవ్వనంగా కనిపిస్తారు. కీరదోసను క్రమం తప్పకుండా తీసుకుంటే ముఖం కాంతిమంతంగా.. తేజస్సుతో కనిపిస్తుంది.
కీరదోసల్లో దాదాపు 95 శాతం నీరే ఉంటుంది. వేసవికాలంలో కీరదోసను తీసుకోవడం వలన ఎండలకు వాడిపోయిన చర్మానికి జీవం పోస్తుంది. కీరదోసలో అధిక మొత్తంలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మం ఎర్రబడటాన్ని తగ్గిస్తాయి. కీరదోసలో ఉండే హైడ్రేటింగ్ సుగుణాలు పొడిబారిన చర్మానికి పరిష్కారం లభించడంతోపాటు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.
Also Read: Save HCU Movement: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. 'మమ్మల్ని అభినందించాలి'
మొటిమలను తగ్గించడంలోనూ దోసకాయ సహాయపడుతుంది. కీర తినడం వలన మొటిమలతో కలిగే మంట, ఎరుపు, చికాకును తగ్గిస్తుంది. చర్మంపై మృతకణాలను తొలగించి.. మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరిపిస్తుంది. భవిష్యత్తులోనూ మొటిమలు రాకుండా కీరదోస నిరోధకంగా పని చేస్తుంది.
దోసకాయలో యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కోవడంలో సాయపడతాయి. చర్మంపై గీతలు, ముడతలు, నల్ల మచ్చలు రాకుండా చూస్తాయి.
దోసకాయనే కాదు దాని తొక్క కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కీరదోసలో విటమిన్ కే, విటమిన్ సీ, కాల్షియం, పొటాషియం, పీచు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









