Curd Rice Benefits In Telugu: వేసవిలో ప్రతి రోజు పెరుగన్నం తినడం మంచిదేనా? నిజానికి రోజు తినడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. పెరుగన్నంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల, కణాల నిర్మాణానికి ఎంతో సహాయపడుతుంది. ఇందులో కాల్షియం కూడా ఎక్కువగా లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రతి రోజు పెరుగన్నం తినడం వల్ల శరీరానికి ఫాస్ఫరస్, విటమిన్ బి12, ప్రోబయోటిక్స్, రిబోఫ్లావిన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తినడం దీనిని తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా వేసవిలో తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు పొందుతారు. అయితే రోజు తినడం వల్ల ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో పెరుగన్నం తినడం వల్ల కలిగే లాభాలు:
జీర్ణక్రియకు మంచిది:
పెరుగన్నంలో ప్రోబయోటిక్స్ ఎక్కువ మోతాదులో లభిస్తున్నాయి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది జీర్ణక్రియను సాఫీగా చేసి, మలబద్ధకం సమస్యను నివారించేందుకు సహాయపడుతుంది. తరచుగా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారికి పెరుగున్నం చాలా బాగా పని చేస్తుంది.
శరీరానికి చలువ చేస్తుంది:
పెరుగన్నం రోజు తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి శరీరానికి చల్లదనం అందించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఇవి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడటానికి ఎంతో సహాయపడుతుంది. తరచుగా సీజనల్ సమస్యలతో బాధపడేవారికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.
కాల్షియం:
పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలతో పాటు దంతాలను ఆరోగ్యవంతంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా తరచుగా వచ్చే ఎముకల సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఇందులో లభించే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందించేందుకు ఎంతో సహాయపడుతుంది.
ఒత్తిడి కూడా తగ్గుతుంది:
కొన్ని అధ్యయనాల ప్రకారం, పెరుగన్నం రోజు తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఒత్తిడి కూడా పూర్తిగా తొలగిపోతుంది.. ఈ అన్నం తింటే చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇవే కాకుండా జీర్ణ సంబంధింత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









