)
Curry Leaf Buttermilk: పూర్వపు రోజుల్లో మానవులు తప్పనిసరిగా గంజి లేదా మజ్జిగ తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకునేవారు. ఇలా గంజి లేదా మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలతో పాటు చలువ చేస్తుందని నమ్ముతారు. మారుతున్న అలవాట్ల కారణంగా మనలో చాలా మంది ఇప్పుడు జ్యూస్ తాగుతుండగా.. ఒకప్పుడు మజ్జిగ ఎంతో ఫేమస్.. ఇప్పటికీ పల్లెల్లో చాలా మంది మజ్జిగను ఎక్కువగా సేవిస్తుంటారు. అయితే మజ్జిగ తాగడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహ రోగులకు మజ్జిగ చాలా ప్రయోజనకరంగానే కాకుండా ఓ ఔషధంగా పనిచేస్తుంది. మజ్జిగలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. మధుమేహ రోగులు తమ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల మరిన్ని వ్యాధులు సంక్రమించే ప్రమాదం లేకపోలేదు.
రక్తంలో చక్కెర పెరుగుదల కారణంగా.. రోగులు చేతులు, కాళ్ళలో దృఢత్వాన్ని కోల్పోయిన అనుభవాన్ని చవిచూస్తారు. దీనితో పాటు వారికి ఎన్నో రకాల నొప్పులు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారంలో పెరుగుకు బదులుగా మజ్జిగ తీసుకోవడం శరీరానికి మంచిది. మజ్జిగ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. కానీ ఒక పదార్థాన్ని మజ్జిగలో కలపడం వల్ల అనేక రకాలైన ప్రయోజనాలు చేకూరతాయి.
ఒక గ్లాసు మజ్జిగలో 10 నుండి 15 కరివేపాకు ఆకులు వేసి మూతపెట్టి, సుమారు 1 గంటసేపు అలాగే ఉంచండి. తర్వాత ఈ మజ్జిగ తాగండి. కరివేపాకు మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కరివేపాకు మూత్రపిండాల్లో రాళ్లకు కూడా మంచి ఇంటి నివారణ.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook