Daily Orange:  ప్రతిరోజూ ఆరెంజ్‌ తీసుకోవడం వల్ల చర్మం, గుండె, జుట్టుపై ఎలా పనిచేస్తుందో తెలుసా?

Daily Orange Benefits: ప్రతిరోజు మన శరీరానికి విటమిన్స్, మినరల్స్ ఎంతో అవసరం. అయితే ఆరెంజ్ తీసుకోవడం వల్ల విటమిన్ సీ పుష్కలంగా అందుతుంది. రెగ్యులర్‌గా ఆరెంజ్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Apr 13, 2025, 10:44 AM IST
Daily Orange:  ప్రతిరోజూ ఆరెంజ్‌ తీసుకోవడం వల్ల చర్మం, గుండె, జుట్టుపై ఎలా పనిచేస్తుందో తెలుసా?

Daily Orange Benefits: మన డైట్‌లో ఆరెంజ్ ఉండడం ఎంతో ముఖ్యం. ఇందులో విటమిన్ సీ, ఫైబర్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మన శరీరా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రధానంగా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచి.. గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ప్రతిరోజు ఆరెంజ్ పండు తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

 రెగ్యులర్‌గా ఆరెంజ్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్ పవర్ అందుతుంది. దీంతో సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. సెల్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. ఇందులో యాంటీ బాడీ ఉత్పత్తికి ప్రేరేపించే గుణాలు కలిగి ఉంటాయని నివేదికలు తెలిపాయి. ఆక్సిడేటీవ్‌ స్ట్రెస్‌ నుంచి ఇది మన శరీరాన్ని కాపాడుతుంది.

 ఆరెంజ్ పండు గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పొటాషియం కూడా ఉండటం వల్ల ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. సోడియం లెవెల్ స్థాయిలను నివారిస్తుంది.

రెగ్యులర్‌గా కమల పండు తీసుకోవడం వల్ల మీకు కడుపు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. అంతేకాదు దీర్ఘకాలిక మలబద్ధక సమస్యలను తగ్గించేస్తుంది. ఇందులో ఉండే పాలీఫెనల్స్ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమస్యలను తగ్గించేస్తాయి .

ఇదీ చదవండి:  అమ్మ అనుపమా.. అతడితో డేటింగ్‌లో ఉన్నావా? ఆన్‌లైన్‌లో లీకైన లిప్‌లాక్‌ ఫోటో వైరల్‌..  

 ఆరెంజ్ పండు ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మాని కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది వయసు రీత్యా వచ్చే వృధ్యాప్య ఛాయలు ముఖంపై కనిపించకుండా ఆలస్యం చేస్తుంది. ఇందులో బీటా కెరోటీన్‌ కూడా ఉండటం వల్ల చర్మానికి ఒక షీల్డ్ ల పనిచేస్తుంది. విటమిన్ సి కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో ముఖంపై మచ్చలు, గీతాలు తగ్గిపోతాయి

 బరువు నిర్వహణ ఉన్నవారు ఆరెంజ్‌ పండు తీసుకోవాలి. ఇందులో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటాయి అదే విధంగా క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కల్పిస్తుంది. తద్వారా అతిగా తినకుండా ఉంటారు. ఇందులో ఉండే విటమిన్ సి, ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీ ఆరోగ్యకరమైన పనితీరుకు కూడా ప్రేరేపిస్తుంది.

ఇదీ చదవండి: కోలుకున్న మార్క్‌ శంకర్‌.. హైదరాబాద్‌ తీసుకువచ్చిన పవన్‌ దంపతుల వీడియో వైరల్

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News