Dark Chocolate: డార్క్ చాకోలేట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ తగిన మోతాదులో తినడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. డార్క్ చాకోలేట్ ఆరోగ్యపరంగానే కాకుండా రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలామంది డార్క్ చాకోలేట్ తినమని సూచిస్తుంటారు.
చాకోలేట్ వర్సెస్ డార్క్ చాకోలేట్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. డార్క్ చాకోలేట్ ఆరోగ్యపరంగా ప్రయోజనకరమైంది. కొన్ని అధ్యయనాల ప్రకారం డార్క్ చాకొలేట్ క్రమం తప్పకుండా తీసుకుంటే ఊహించని లాభాలు కలుగుతాయి. డార్క్ చాకోలేట్ తినడం వల్ల ఆయుష్షు పెరుగుతుందంటారు. ఇది ఎంతవరకు నిజం, ఎలాంటి లాభాలు కలుగుతాయో చెక్ చేద్దాం. డార్క్ చాకోలేట్ రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగని అతిగా తింటే హాని కలుగుతుంది. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. 70 శాతం కోకో కలిగిన డార్క్ చాకోలేట్ చాలా ప్రయోజనకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఐరన్, మెగ్నీషియం, పైబర్, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలు చాలా ఉంటాయి. ఇవి ఆరోగ్యం స్థిరంగా ఉండేట్టు చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్, పోలీఫెనోల్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు తరచూ ఎదుర్కునే ఆక్సిడేటివ్ ఒత్తిడిని దూరం చేస్తాయి. స్వెల్లింగ్ సమస్యను పోగొడతాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని సమర్ధవంతంగా కాపాడుతాయి.
డార్క్ చాకోలేట్‌లో ఫ్లెవనాయిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి సెరోటోనిన్, ఎండోఫిన్ లెవెల్స్‌ను పెంచి మెదడు ఆరోగ్యాన్ని స్థిరీకరిస్తాయి. మూడ్ స్వింగ్ లేదా ఆందోళన తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. కోకోలో ఉండే పోషకాలు రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది. గుండెకు హాని కలగకుండా చేస్తుంది. అయితే డార్క్ చాకోలేట్ అతిగా తినడం వల్ల కేలరీలు పెరిగిపోయి బరువు అదుపు తప్పుతుంది. ఇందులో ఉండే షుగర్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే మితంగా తీసుకోవాలి.
రోజుకు 30-40 గ్రాములకు మించి డార్క్ చాకోలేట్ తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేలరీలు అతిగా ఉండటం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
Also read: Aadhaar Rule changed: ఆధార్ కార్డులో కీలకమైన మార్పు, ఇకపై ఎవరికైనా అథెంటికేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









