Diabetes Control With Coriander: కొత్తిమీరలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలుంటాయి. ఇందులో  విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా బాడీకి కావాల్సిన A, B, C E, B6 విటమిన్లు తగినంత మోతాదులో ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంలో బాగంగా తీసుకుంటే శరానికి చాలా రకాల పోషకాలు అందుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ పరిమాణంతో పెద్ద మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఈ కొత్తిమీరతో చేసిన డ్రింక్స్‌ తీసుకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కొత్తిమీరతో స్మూతీని తయారు చేసుకుని తాగడం వల్ల బాడీకి మంచి పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఇది క్రమం తప్పకుండా తీసుకోవడం కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో పాటు అధిక బరువుతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే ఇందులో ఉండే మూలకాలు రక్తంలో చక్కెర పరిమాణాలను నిమత్రించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడుతున్నవారు ఈ డ్రింక్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


కొత్తిమీర స్మూతీ తయారీకి కావలసిన పదార్థాలు:
>>కొత్తిమీర కట్ట - ఒకటి
>>తాజా పెరుగు - ఒక గిన్నెడు
>>దాల్చిన చెక్క పొడి - 1-2 గ్రాములు
>>తేనె - రుచికి తగినంత


కొత్తిమీర స్మూతీని ఎలా తయారు చేయాలి:
కొత్తిమీర స్మూతీని తయారు చేయడం చాలా సులభం. అయితే దీని కోసం ముందుగా కొత్తిమీర కట్ట మిక్సీలో వేసి గ్రైడ్‌ చేయాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకుని అందులో తాజా పెరుగును వేయాలి. ఇలా వేసిన వాటిని ఫైన్‌గా మిక్స్‌ చేసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క పొడి వేసుకుని మిక్స్‌ కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిని ఖాళీ కడుపుతో తీసుకునే క్రమంలో తేనెను వేసి కలుపుకుని తాగి శరీరానికి ప్రయోజనాలు కలగడమేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలోకి వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook