Diabetes Signs: రక్తంతో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కొన్ని లక్షణాలు స్పష్టంగా కన్పిస్తాయి. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించగలిగితే మాత్రం తగిన చికిత్స ద్వారా డయాబెటిస్ నియంత్రించవచ్చు. ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.
డయాబెటిస్ అనేది ఓ లైఫ్‌స్టైల్ వ్యాధి. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే వ్యాధి ఇది. జాగ్రత్తగా ఉంటే నియంత్రణలో ఉంటుంది. లేకపోతే ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా అధిక దాహం, తీవ్రమైన అలసట, మసకగా కన్పించడం వంటివి ప్రధాన లక్షణాలు. రాత్రి వేళ నీరు ఎక్కువగా తాగినా ఉదయం లేవగానే విపరీతమైన దాహం ఉంటుంది. లేదా రాత్రి వేళ తరచూ మూత్రానికి వెళ్తుంటారు. ఈ రెండు లక్షణాలు మధుమేహానికి చిహ్నాలు. రాత్రి బాగా నిద్రపోయినా ఉదయం తీవ్రమైన అలసట ఉంటుంది. ఎనర్జీ ఏ మాత్రం ఉండదు. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఈ లక్షణాలు కన్పిస్తాయి. శరీరం గ్లూకోజ్‌ను సరిగ్గా సంగ్రహించకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.
ఉదయం లేవగానే మసకగా కన్పించినా లేక స్పష్టంగా వస్తువులు కన్పించకపోయినా డయాబెటిస్ అధికంగా ఉందని అర్ధం. ఒక్కోసారి చిన్న చిన్న గాయాలైనప్పుడు డయాబెటిస్ కారణంగా త్వరగా మానవు. ఎందుకంటే బ్లడ్ షుగర్ అనేది రక్త ప్రసరణపై ప్రభావం చూపిస్తుంది. ఇమ్యూనిటీ తగ్గవచ్చు. తరచూ ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. అకారణంగా బరువు తగ్గిపోవచ్చు.
ఈ లక్షణాలు ఉదయం వేళ కన్పిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిన సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడే డయాబెటిస్ నియంత్రణ సాధ్యమౌతుంది. ముఖ్యంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించుకోవాలి.
Also read: Tata Altroz Facelift: టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది, లోన్ ఈఎంఐ వివరాలు మీ కోసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook









