Ladies Finger Side Effects: బెండకాయ అంటే మనకు తెలిసిన కూరగాయ. కానీ దీనిలో ఉన్న పోషక విలువలు మనకు తెలిస్తే ఆశ్చర్యపోతాము. బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. బెండకాయలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. పొటాషియం రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బెండకాయలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బెండకాయ తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.
బెండకాయలోని విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెండకాయతో వివిధ రకాల కూరలు, పచ్చడి, పకోడిలు తయారు చేస్తారు. అయితే ఆరోగ్యనిపుణులు ప్రకారం బెండకాయ కూర తిన్నాక కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకోకుడదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోకుడదు అనేది మనం తెలుసుకుందాం.
బెండకాయ కూర తిన్న తరువాత తీసుకోకూడని పదార్థాలు:
బెండకాయ కూర తిన్న తరువాత పాలు తీసుకోవడం వల్ల మూత్రపిండ సమస్యలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అందుకంటే రెండిటిలో కాల్షియం ఉంటుంది. దీంతో పాటు ఆక్సలేట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల ఉన్నవారు బెండకాయ కూర తిన్న తరువాత పాలు తాగుతే ఈ సమస్య మరింత పెరుగుతుంది. అలాగే కాకరకాయ తీసుకోవడం మంచిది కాదు. బెండకాయ కూర, కాకర కూర తింటే జీర్ణవ్యవస్థ సమస్యలు కలుగుతాయి. కాకరకాయ వేడిని కలిగిస్తుంది. వీటిని కలిపి తింటే మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు కలుగుతాయి.
బెండకాయ కూర తిన్న తరువాత టీ తాగకూడదు. దీని వల్ల శరీరం వేడిగా ఉంటుంది. ఆరోగ్యనిపుణుల ప్రకారం టీ ని భోజనం తరువాత తాగడం మంచిది కాదు. దీని వల్ల అనారోగ్యసమస్యలు కలుగుతాయి. అలాగే బెండకాయను ముల్లంగితో కూడా తినకూడదు. దీని వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు కలుగుతాయి. అలాగే పొట్టలో ఎసిడిటీ కూడా కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. జీర్ణసమస్యలతో బాధపడేవారు ముల్లంగి, బెండ కాయ తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా కలుగుతాయి.
బెండకాయ కూర తో తీసుకోగలిగే ఆహారపదార్థాలు:
బెండకాయ కూరతో చపాతీని తీసుకోవడం చాలా మందికి ఇష్టమైన కాంబినేషన్.
బెండకాయ కర్రీని నన్‌తో తీసుకోవడం కూడా రుచికరంగా ఉంటుంది.
పరాటాలో బెండకాయ కూరను చుట్టి తింటే రుచి ఎంతోగా ఉంటుంది.
బెండకాయ కూరతో పెసర పప్పు దోసెను తీసుకోవడం కొత్త రుచిని అందిస్తుంది.
ఉప్మా దోసెతో బెండకాయ కర్రీని కలిపి తింటే రుచికరంగా ఉంటుంది.
బెండకాయ కూరతో కలిపి తీసుకోవచ్చు ఇతర కూరగాయలు:
టమాటా: బెండకాయ కూరలో టమాటాను కలిపి చేస్తే రుచి మరింతగా పెరుగుతుంది.
పచ్చిమిరపకాయ: కొద్దిగా కారం కోసం పచ్చిమిరపకాయలను కూడా జోడించవచ్చు.
ఉల్లిపాయ: ఉల్లిపాయలను వేయించి బెండకాయ కూరలో కలిపి చేస్తే రుచి ఎంతోగా ఉంటుంది.
వెల్లుల్లి: వెల్లుల్లి రుచిని ఇష్టపడితే కొద్దిగా వెల్లుల్లిని కూడా జోడించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe Twitter, Facebook
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









