Dondakaya Health Benefits: దొండకాయ (Dondakaya) ను ఐవీ గార్డ్ అని కూడా పిలుస్తారు. వీటిని కూర రూపంలో తయారు చేస్తాం. అయితే దొండకాయ తీసుకోవటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండు. ఇది ఎక్కువగా ఆసియా దేశాల్లో పండుతుంది. ఇది కూడా కుకుంబర్ జాతికి చెందిన కాయ. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దొండకాయను మన రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండు. కీరదోసకాయ జాతికి చెందిన దొండకాయలు తీసుకోవడం వల్ల ఫైబర్, నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది మన శరీరానికి కావాల్సిన ఖనిజాలను అందిస్తుంది. ముఖ్యంగా దొండకాయలు విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అంతేకాదు ఆరోగ్యకరమైన చర్మాని కూడా ఇది ప్రేరేపిస్తుంది దొండకాయలో క్యాల్షియం పొటాషియం ఐరన్ ఉంటుంది శరీర ఆరోగ్యానికి ఇవి ఎంతో అవసరం.. నోటి పూత సమస్యను కూడా ఇది సమర్థవంతంగా తగ్గిస్తుంది.
దొండకాయలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంచుతుంది. దొండకాయను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకతకు తోడ్పడుతుంది.. అంతేకాదు గ్లూకోస్ గ్రహించడానికి తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు దొండకాయను తినవచ్చు.
బరువు తగ్గాలనుకునేవారు దొండకాయను తీసుకోవాలి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు నిర్వహణలో ఉండాలంటే దొండకాయ కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాదు ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కల్పిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు బీటా కెరోటీన్ కూడా దొండకాయలో ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్స్ నుంచి కాపాడతాయి. ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తుంది.
READ ALSO: SLBC Tunnel: ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్ డాగ్స్.. మరికొద్ది క్షణాల్లో...
దొండకాయలు యాంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటీస్, కీళ్ల నొప్పుల సమస్య నుంచి మనల్ని కాపాడతాయి. అంతేకాదు కాలేయ ఆరోగ్యానికి కూడా దొండకాయను తీసుకోవాలి. దొండకాయను రొంప సమస్యలు తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది ఆస్తమా, బ్రోంకైటీస్ నివారణకు పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
సాధారణంగా దొండకాయలు కూర లేదా ఫ్రై రూపంలో తయారు చేసుకుంటారు. మన బామ్మల కాలం నాటి నుండి ఈ దొండకాయని ఉపయోగిస్తారు. ఇందులో కావాలంటే స్పైసెస్ ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. మరికొంతమంది పచ్చళ్ళు కూడా తయారు చేస్తారు. వీటిని సూప్ రూపంలో కూడా తీసుకోవడం వల్ల ఖనిజాలు అందుతాయి. దొండకాయలను టమాటో ఉల్లిపాయలతో సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
READ ALSO: నేటి రాశిఫలాలు.. ఈ రాశికి ఈరోజు తిరుగేఉండదు, ఏం లక్కు చేసుకున్నారు?
అయితే దొండకాయలు ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం. కానీ, అతిగా తినకుండా ఉండాలి. కొంతమందికి ఎలర్జీ సమస్యలు ఉంటాయి. దొండకాయలు తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఆరోగ్య నిపుణుల సలహా తీసుకొని దొండకాయను డైట్లో చేర్చుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









