Drumstick: మునగకాయ.. 300 పైగా రోగాలను నయం చేసే కాయ..

Drumstick: ఎండాకాలం ప్రారంభం కాబోతుంది. మనగకాయ నీటి శాతం అధికంగా ఉండే ఆహారం. ఎండాకాలం నీరు అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి. అయితే మునగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ అందుతుంది. ఇది ఒక సూపర్ ఫుడ్ కాయతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Feb 27, 2025, 02:28 PM IST
Drumstick: మునగకాయ.. 300 పైగా రోగాలను నయం చేసే కాయ..

Drumstick Health Benefits: మునగకాయలు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో థెరపిటిక్‌ గుణాలు కూడా కలిగి ఉంటుంది. అందుకే మునగకాయ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.. మునగను ఎండాకాలం సమయంలో తీసుకోవడం వల్ల పుష్కల ప్రయోజనాలు అవి ఏంటో తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

ఎండాకాలంలో మునగకాయను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ, ఫ్రీ రాడికల్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి. అంతేకాదు మన చర్మం ఇచ్చే యవ్వనంగా కనిపించేలా మెరిసేలా చేస్తుంది. మునగకాయలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖంపై ఉండే యాక్నేను తగ్గించేస్తుంది. అంతేకాదు ముఖంపై ఉన్న దురదలు ఉంటే తొలగించేస్తుంది. మచ్చలు, గీతాలు నివారించే గుణం మునగకాయలో ఉన్నాయి.

మునగకాయను తరచూ మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే ఐరన్, విటమిన్ సి, కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అంతేకాదు రక్త సరఫరాను మెరుగు చేస్తుంది. కుదుళ్ల ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. రెగ్యులర్ డైట్ లో మునగకాయ పప్పు లేదా కూర రూపంలో తీసుకోవచ్చు .

కొత్తగా జన్మనిచ్చిన తల్లులకు కూడా ఈ మునగకాయ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు కూడా ఉంటాయి. మునగా కాయలో నయం చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కొత్తగా తల్లులైన వారికి మంచి ఆరోగ్యకరమైన ఆహారం. అంతే కాదు ఇది తల్లులకు పాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది.

మునగకాయను మన డైలీ రొటీన్ లో చేర్చుకోవడం వల్ల ఇందులోనే మెగ్నీషియం, విటమిన్ బి స్ట్రెస్ ను తగ్గిస్తుంది. అంతే కాదు నిద్ర లేమి సమస్యకు చెక్‌ పెడుతుంది. మూడ్‌ స్వింగ్స్ తో బాధపడుతున్న వారు మునగకాయ తీసుకోవాలి.

ఇదీ చదవండి:  ఐడీబీఐ బంపర్‌ నోటిఫికేషన్‌.. 650 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ, వెంటనే అప్లై చేయండి..  

మునగకాయలు మన డైలీ డైట్‌లో ఉండడం వల్ల ఇందులో న్యూట్రియన్స్ ఉంటాయి. ఇది ఈస్ట్రోజన్ సహాయకరంగా ఉంటాయి. మెటబాలిజం రేటును పెంచి హార్మోనల్ అసమతుల్యత సమస్యను తగ్గించేస్తుంది. మునక్కాయ పిల్లలకు పెట్టడం వల్ల కూడా మంచి శక్తి అందుతుంది.. ఎందుకంటే ఇందులో కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీటిని వాళ్లకు చపాతీలో పెట్టవచ్చు లేదా కూర రూపంలో కూడా అందించవచ్చు. 

మునగకాయలో క్యాల్షియం, ఐరన్, జింక్, సెలినియం ఉంటుంది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటీస్‌ సమస్యకు ఎఫెక్టివ్ రెమిడీ. కీళ్లనొప్పులతో బాధపడేవారు మునక్కాయలు తీసుకోవాలి. అంతేకాదు డయాబెటిస్ రోగులకు కూడా మునగకాయ మంచిది. ఇది బీపీ సమస్యను తగ్గించి కిడ్నీ ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. థైరాయిడ్ తో బాధపడే వారికి కూడా మునగకాయ వరం.

ఇదీ చదవండి: టన్నెల్‌ చివరి వరకు వెళ్లిన ఆర్మీ రెస్క్యూ టీమ్‌.. 'ఆ 8 మంది చనిపోయి ఉంటారు'..

మునగకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేషన్ గుణాలు ఉంటాయి. ఇది ఎముకలు ఆరోగ్యంగా ఉంచేలా ప్రేరేపిస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. డయాబెటిస్ రోగులకు కూడా ఇది వారం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, కొలెస్ట్రాల్ తగ్గించేస్తుంది. హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడుతున్న వారు మునక్కాయలు తీసుకోవాలి. అంతేకాదు మునగ కాయ రెగ్యులర్ డైట్ లో ఉండటం వల్ల కాలేయ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆస్తమా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మునగకాయ తీసుకోవాలి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News