Drumstick Health Benefits: మునగకాయ ఆయుర్వేద పరంగా మెడిసినల్ గుణాలు ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా ఇది ఆయుర్వేద పరంగా ఉపయోగిస్తున్నారు కూడా. అయితే, మునగ ఆకుల్లో కూడా కాయలకు మించిన ప్రయోజనాలు ఉంటాయి. అయితే మునగకాయ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈరోజు మనం తెలుసుకుందాం.. దీంతో మనకు ఐదు అద్భుత ప్రయోజనాలు
మునగ ఆకుల ఇమ్యూనిటీని బలపరుస్తాయి. ఇందులో విటమిన్ సి ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని కాపాడి ఇమ్యూనిటీని బలంగా మారుస్తాయి. అంతేకాదు ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటుంది. ఫైబర్‌లో అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి మునగకాయ ఆకు తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలుగుతుంది. బరువు కూడా పెరగరు .
రక్తంలో చక్కర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. మునగా డయాబెటిస్ తో బాధపడేవారు మునగను డైట్లో చేర్చుకోవాలి. అంతేకాదు ఇందులో క్యాల్షియం, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. ఎముకలను బలంగా మారుస్తుంది. ఆస్టియోపోరోసిస్ రాకుండా నివారిస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇక జీర్ణ సమస్యలను కూడా తక్షణమే మంచి రిలీఫ్ ఇస్తుంది. దీర్ఘకాలిక మలక బద్దక సమస్యతో బాధపడుతున్నారు మునగను డైట్ లో చేర్చుకోవాలి.
READ ALSO: ఈరోజు రాశిఫలాలు.. నేడు ఈ రాశికి ప్రతి పనిలో ఇబ్బందులు తప్పవు..
మునగ ఆకులతో స్మూథీ కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని బ్లెండ్ చేసి సూప్ మాదిరి కూడా తయారు చేసుకోవచ్చు. ప్రధానంగా మునగా ఆకుతో హెర్బల్ టీ తీసుకుంటారు. ఇందులో తేనె వేసుకొని తీసుకోవచ్చు ఇది కాకుండా మునగ ఆకు లేదా మునగకాయ గుజ్జుతో చపాతి కూడా తయారు చేసుకుంటారు. దీన్ని ఈ విధంగా డైట్ లో చేర్చుకోవచ్చు. మునగకాయతో సాంబార్, పప్పు వంటివి కూడా తయారు చేసుకుంటారు .(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









