)
Eggs For Vitamin-D Deficiency: చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో విటమిన్-డి లోపం సర్వసాధారణమే. దీని లోపం వల్ల ఎముకలు, కండరాలు బలహీనంగా మారడం సహా రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. అయితే మనం తినే ఆహారంలో ఉడికించిన గుడ్డులో విటమిన్-డి, ప్రోటీన్లతో పాటు ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఈ విధంగా చలికాలంలో మీరు రోజూ కోడిగుడ్డును మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక లాభాలు చేకూరుతాయి. అయితే గుడ్లు అతిగా తిన్నా కూడా అనేక సమస్యలకు దారితీస్తుంది. మీ వయస్సు ఆధారంగా మీరు రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చే ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలం మరింత ముదురుతున్న కొద్దీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. చల్లని వాతావరణం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు పెరగడమే కాకుండా చాలా మందిలో విటమిన్-డి కరవు అవుతుంది. సూర్యరశ్మి శరీరానికి ఎక్కువగా తగలకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు రావొచ్చు. అయితే ఈ లోపాన్ని కోడిగుడ్ల ద్వారా భర్తీ చేసుకోవచ్చు. కోడిగుడ్లలో ప్రొటీన్, విటమిన్-డితో పాటు ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి.
విటమిన్-డి అనే పోషకం మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది కండరాల వ్యవస్థతో పాటు ఎముకల నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో ఎంతో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తితో పాటు నాడీ వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు కూడా ఇది సహకరిస్తుంది. చలికాలంలో మీ శరీరంలో విటమిన్-డి లోపం ఉంటే.. బలహీనత, కీళ్ల నొప్పులు, అలసట, మానసిక స్థితిలో మార్పులు, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
పోషకాలు అధికంగా..
గుడ్డులో విటమిన్-డి మూలమే కాకుండా.. శీతాకాలంలో శరీరాన్ని వెచ్చదనంగా ఉంచేందుకు సాయపడుతుంది. కోడిగుడ్డులో విటమిన్ డితో పాటు విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ బి12, విటమిన్ ఇ, ఫాస్పరస్, ఫోలేట్, సెలీనియం, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, జింక్, ఐరన్, ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ డేటా ప్రకారం.. 100 గ్రాముల గుడ్లలో 87 మైక్రోగ్రాముల విటమిన్-డి, 149 మైక్రోగ్రాముల విటమిన్-ఎ, 12.6 గ్రాముల ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
మీ వయస్సు ప్రకారం ఎన్ని గుడ్లు తినాలి?
నేషనల్ లైబ్రరీ ఆఫ్ హెల్త్ ప్రకారం.. మీ శరీరానికి అవసరమయ్యే విటమిన్-డి కోసం మీ వయసు ఆధారపడి ఉంటుంది. మీరు 14-18 ఏళ్ల వయసు వారైతే మీకు రోజుకు 15 మైక్రోగ్రాముల విటమిన్-డి అవసరం ఉంటుంది. ఇలాంటి క్రమంలో పై వయసు గల వారు రోజుకు ఓ గుడ్డు తింటే సరిపోతుంది. ఈ విధంగా మీ వయసును బట్టి మీరు ఎన్ని కోడిగుడ్లు తినాలో ముందుగా తెలుసుకోవడం ఉత్తమం.
శాఖాహారులకు ప్రత్యామ్నాయం
ఒకవేళ మీరు శాఖాహారులైతే.. మీ శరీరానికి సంబంధించిన విటమిన్-డి అవసరాలను తీర్చడానికి పాలు, జున్ను, పెరుగు వంటి పాల ఉత్పత్తులను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే మీ ఆహారంలో కోడిగుడ్లను చేర్చుకోవడం ద్వారా విటమిన్-డి లోపాన్ని నివారించుకోవడమే కాకుండా
శరీరంలో వెచ్చదనం, పోషకాహారం వంటివి లభిస్తాయి.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించండి. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook