)
Fatty liver: నేటికాలంలో చాలామంది కాలేయానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటివారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. ఫ్యాటీ లివర్ లక్షణాలను తగ్గించేందుకు కూడా ఈ ఆహారాలు ఉపయోగపడతాయి. పోషకాహార నిపుణులు ఫ్యాటీ లివర్ డిసీజ్ తగ్గేందుకు కొన్ని ఫుడ్స్ జాబితాను షేర్ చేశారు. లివర్ హెల్త్ కోసం ఎలాంటి ఫుడ్స్ తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు:
నల్లమిరియాలు కలిపిన పసుపును రోజుకోసారి నీరు లేదా పాలలో కలిసి వారానికి ఒకసారి తీసుకోవచ్చు. ఆపై 2 వారాల తర్వాత తిరిగి ప్రారంభించవచ్చు. పసుపు లివర్ డిటాక్స్ గా పనిచేస్తుంది.
వెల్లుల్లి:
వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని తురిమి నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని చల్లార్చి తాగాలి. వెల్లుల్లి తరుగును అన్నంలో కలుపుకుని తినాలి. వెల్లుల్లి ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తుంది.
నిమ్మకాయ:
ప్రతిరోజూ ఒక స్పూన్ నిమ్మరసం భోజనంపై చల్లుకుని తినడం అలవాటు చేసుకోవాలి. నిమ్మరసం అనేది కాలేయ ప్రక్షాళనకు తోడ్పడుతుంది.
టొమాటో:
టమోటాలను ప్రతిరోజూ తినాలి. టమోటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో అవి కాలేయానికి మేలు చేస్తాయి.
ఓట్స్:
ఓట్స్ ను ప్రతిరోజూ మీ ఆహారంలో చేర్చుకోవాలి. దీన్ని పౌడర్ చేసి రోటీ లేదా అట్ల పిండిలో కలుపుకుని తింటే చాలా మంచిది. ఓట్స్ లో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది.
ఫ్యాటీ లివర్ అంటే ఏంటి?
మానవ శరీరంలో లివర్ అనేది ముఖ్యమైన అవయవం. ఇది డిటాక్సిఫికేషన్ కార్బోహైడ్రేట్లు జీవక్రియ, కొవ్వు ప్రొటీన్లు వంటి పలు ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ ను హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా అంటారు. మీ కాలేయ కణాలు ఎక్కువగా కొవ్వును సేకరించినప్పుడు ఇది సంభవిస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ కణాల సాధారణ జీవక్రియ విధులకు ఆటంకం కలిగిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook