)
Fatty Liver Diet: ఫ్యాటీ లివర్ ఈరోజుల్లో షుగర్, బీపీ మాదిరి సాధారణమైపోయింది. ఈ సమస్య ఉన్నవారు కేవలం ఆల్కహాల్ తీసుకున్న వారు మాత్రమే కాదు.. మందు తీసుకోలేని వెజిటేరియన్స్ కూడా ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు. మీ డైట్ లో ఈ మార్పులు చేసుకుంటే మీరు ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడవచ్చు.
మీరు తీసుకునే ఫుడ్ లో తృణధాన్యాలు, ఓట్స్ , బ్రౌన్ రైస్, క్వినోవా వంటివి డైట్లో చేర్చుకోవాలి. వీటితో పాటు తాజా కూరగాయలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్మీల్ చియా సీడ్స్, తాజా బెర్రీ పండ్లు యాంటీ ఆక్సిడెంట్లతోపాటు కరిగే ఫైబర్ తినాలి. ఇవి ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిస్తాయి. దీంతో పాటు బ్రోకోలీ, క్యారెట్, పాలకూర, తృణధాన్యాలు మీ డైట్ లో చేర్చుకోవాలి. ఇది డిన్నర్ సమయంలో తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఉన్నవారికి కూడా ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాలకు రీఫైండ్ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
మీ డైట్ లో కేవలం ఆరోగ్యకరమైన కొవ్వులు మాత్రమే చేర్చుకోవాలి. స్కిన్ లెస్ చికెన్, ఫిష్ తోఫు వంటివి తినాలి. ఇది లివర్ టిష్యూ సమస్యను నయం చేసే గుణాలు కలిగి ఉంటాయి. అంతేకాదు ఒమేగా 3 ఉండే సాల్మన్ సార్డైన్ చేపలు తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఫ్యాటీలివర్ సమస్యను తగ్గిస్తాయి. దీంతో పాటు ఆలివ్ ఆయిల్ అవిసె గింజలు, మెటబాలిక్ రేటును పెంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. వెజిటేబుల్స్ వేసిన ఆమ్లెట్ వంటివి ఉదయం బ్రేకఫాస్ట్ లో తినాలి. ఇందులో ప్రోటీన్ తో పాటు డైటరీ ఫైబర్ నట్స్, వెజిటేబుల్స్ కూడా డైట్ లో చేర్చుకోవాలి
ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్ లో చేర్చుకోవాలి. ఇది జీర్ణ ఆరోగ్యానికి మంచిది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తుంది బీన్స్ ఆకుపచ్చ కూరగాయలు కాలే పాలకూర పేగు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇన్సులో నిరోధకతను కూడా నివారిస్తుంది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తుంది దీంతోపాటు నిమ్మకాయ ఆలివ్ ఆయిల్ సలాడ్‌లో వేసుకొని తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఎక్కువగా సూప్స్ వెజిటేబుల్స్ వంటివి తినాలి
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆరెంజ్, మామిడి, బెల్ పెప్పర్, టమాట, బెర్రీ పండ్లు, గ్రీన్ టీ వంటివి కాలేయాన్ని కాపాడుతాయి. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. నిమ్మ జాతికి చెందిన కివి పండ్లు, నిమ్మకాయ, ఆరెంజ్ వంటివి కూడా ఫ్యాట్ స్టోరేజ్ తగ్గిస్తాయి. బాదంపాలు, పాలకూర, బెర్రీ పండ్లు కలిపి కూడా మీరు సలాడ్ల తీసుకోవచ్చు.
ఫ్యాటీ లివర్ నుంచి బయటపడాలంటే మీ డైట్ లో గోధుమలు, జొన్నలు కూడా ఉండాల్సిందే. బ్రౌన్ రైస్, పప్పులు, రాజ్మా పసుపు కలిపి తీసుకోవాలి. చికెన్, పనీర్, పులావ్ కూడా తయారు చేసుకోవచ్చు, నూనె తక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి, పెరుగు రైతా వంటివి కూడా రెగ్యులర్‌గా తీసుకుంటే ప్రోటీన్ అందడంతో పాటు మీ కడుపు కూడా హాయిగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook